BigTV English

OTT Movie : న్యూక్లియర్ బాంబ్ కంటే ఈ కామెడీ బాంబ్ బాగా పేలింది … కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : న్యూక్లియర్ బాంబ్ కంటే ఈ కామెడీ బాంబ్ బాగా పేలింది … కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : ఓటీటీలో హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ లకు కొదవలేదు. సినిమా స్టైల్ లో, వెబ్ సిరీస్ లు కూడా ఓటిటిలో దుమ్ము దులుపుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్, ఒక న్యూక్లియర్ బాంబ్ చుట్టూ తిరుగుతుంది. ఈ యాక్షన్ సినిమాకి కాస్త కామెడీని కూడా జత చేసి ఓటిటిలోకి వదిలారు. ఈ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఓవైపు నవ్విస్తూ, మరోవైపు యాక్షన్ సీన్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో

ఈ అమెరికన్ యాక్షన్ కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ పేరు ‘ఆబ్లిటరేటెడ్’ (Obliterated). దీనిని జోన్ హర్విట్జ్, హేడెన్ ష్లోస్‌బర్గ్, జోష్ హీల్డ్ రూపొందించారు. ఇందులో నిక్ జానో, షెల్లీ హెన్నిగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఒక జాయింట్ స్పెషల్-ఆపరేషన్స్ బృందం చుట్టూ తిరుగుతుంది. లాస్ వెగాస్‌ను న్యూక్లియర్ బాంబ్ నుంచి కాపాడటానికి ఈ బృందం పోరాడుతుంది. ఈ వెబ్ సిరీస్ 2023, నవంబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

యు.ఎస్. సాయుధ దళాల ఇంటెలిజెన్స్ సర్వీసెస్ నుండి, కొంతమంది ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకుంటారు. ఈ బృందం ఒక సీక్రెట్ ఆపరేషన్ మిషన్ లో పని చేయాల్సి ఉంటుంది. వారి మిషన్ లాస్ వెగాస్‌ను నాశనం చేయాలనుకునే, ఒక ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఆపడం. ఈ బృందం తమ మిషన్‌ను విజయవంతంగా ముగించడానికి వెళతారు. అనుకున్నట్లే దీనిని పూర్తి చేస్తారు. ఇందుకు గానూ ఒక రాత్రి ఆల్కహాల్‌తో నిండిన పార్టీతో సంబరాలు చేసుకుంటారు. ఇంతలొనే వీళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. వీళ్ళు నిర్వీర్యం చేసిన న్యూక్లియర్ బాంబ్ నకిలీదని తెలుసుకుంటారు. ఇప్పుడు మత్తులో ఉన్న ఈ బృందం ఈ సమస్యని అధిగమించాల్సి వస్తుంది. నిజమైన బాంబ్‌ను కనిపెట్టి, లాస్ వెగాస్‌ను కాపాడాల్సి ఉంటుంది.

ఎలాగో తేరుకుని ఈ బృందం లాస్ వెగాస్‌ను నాశనం చేయగల, నిజమైన న్యూక్లియర్ బాంబ్‌ను నిర్వీర్యం చేయాడానికి పోరాడుతుంది. వారు రష్యన్ విలన్ అనస్తాసియా కోస్లోవ్‌తో తలపడతారు. ఆమె బాంబ్‌ను ఒక స్లాట్ మెషిన్‌లో దాచిపెడుతుంది. హాగర్టీ అనే బృందంలోని సభ్యుడు బాంబ్ డిస్పోజల్ ఎక్స్‌పర్ట్ గా ఉంటాడు. అతను ఆక్టివ్ లో ఉన్న ఆ న్యూక్లియర్ బాంబ్‌ను డిస్పోజల్ చేయడానికి వెళతాడు. అక్కడ అనస్తాసియా అతనికి అడ్డంకులు తెస్తుంది. చివరికి హాగర్టీ అనుకున్నది సాధిస్తాడా ? ఆ బాంబ్‌ను వీళ్ళు నిజంగానే కనిపెడతారా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : కాటికి కాళ్ళు చాపే వయసులో తోడు కోసం ఆరాటం … ముసలోడే కానీ మహానుభావుడు భయ్యా

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×