OTT Movie : ఓటీటీలో ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. తండ్రి, కూతురి మధ్య ఈ స్టోరీ తిరుగుతుంది. ఒక గ్యాంగ్ స్టర్ వీళ్ళ లైఫ్ లోకి రావడంతో, అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ స్టోరీ చివరి వరకూ ఆసక్తి కరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
ఆహా (aha) లో
ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వల్లమై’ (Vallamai). 2025 లో వచ్చిన ఈ సినిమాకు కరుప్పయ్య మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రేమ్‌గీ అమరెన్, ధివ్యదర్శిని, దీపా శంకర్, సీఆర్ రజిత్, విధు ప్రధాన పాత్రల్లో నటించారు. సూరజ్ నందా దీనికి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ 2025 జనవరి 10న థియేటర్లలో విడుదలై, జూన్ 2025 నుండి ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్టోరీ చెన్నైలో జరిగే ఒక క్రైమ్ చుట్టూ తిరుగుటుంది. 2 గంటల 6 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.0/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
సరవణన్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. అతను తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. సరవణన్ కూతురు ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్ అయిన రాజ్ గ్యాంగ్ జరిపిన దాడిలో అఘాయిత్యానికి గురవుతుంది. ఈ సంఘటన సరవణన్ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అతను న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాడు. అయితే రాజ్‌కు రాజకీయ మద్దతు ఉండటం వల్ల, ఈ కేసును పోలీసులు క్లోస్ చేస్తారు. ఇందుకు గానూ సరవణన్‌ను ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. ఈ సమయంలో అతను భూమిక అనే ఒక జర్నలిస్ట్‌ను కలుస్తాడు, ఆమె రాజ్ గ్యాంగ్‌కు సంబంధించిన అక్రమాలను బయటపెట్టడానికి పనిచేస్తుంటుంది. భూమిక సరవణన్‌కు సహాయం చేస్తూ, అతని ప్రతీకారంలో పాలు పంచుకుంటుంది.
సరవణన్, భూమిక రాజ్ గ్యాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక పథకాన్ని రూపొందిస్తారు. ఈ పథకం వారిని చెన్నై అండర్‌వరల్డ్‌లోని ఒక పెద్ద కుట్రకు చెందిన విషయాలను తెలుసుకునెలా చేస్తుంది. ఇందులో శక్తివంతమైన రాజకీయ నాయకులు, ఒక అవినీతి పోలీసు అధికారి ఉంటారు. ఇక యాక్షన్ సన్నివేశాలు, ఛేజ్ సీక్వెన్స్‌లు, ఊహించని ట్విస్ట్‌లతో. సరవణన్ తన కూతురిపై జరిగిన ఘటనపై, ఒక పెద్ద నెట్‌వర్క్ ఉందని తెలుసుకుంటాడు. ఇప్పుడు అతని ప్రతీకారం ఒక వ్యక్తిగత పోరాటం నుండి సమాజంలోని అవినీతిపై పోరాటంగా మారుతుంది. భూమిక జర్నలిస్ట్‌గా రిస్క్‌లను తీసుకుంటూ, ఈ కుట్రను బయటపెట్టే ఆధారాలు సేకరిస్తుంది. క్లైమాక్స్ లో రాజ్ పై సరవణన్ ఒక యుద్ధమే చేస్తాడు. చివరికి సరవణన్ చెల్లికి న్యాయం జరుగుతుందా ? సరవణన్, రాజ్ ను ఎదుర్కుంటాడా ? భూమిక ఎలాంటి రహస్యాలు బయటపెడుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను చూడండి.
Read Also : అమ్మాయిగా మారి హత్యలు చేసే అబ్బాయి… మైండ్ బెండ్ అయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్