BigTV English

OTT Movie : కాలేజ్ లో కొడుకు బలి… ఆ తల్లి తీర్చుకునే రివేంజ్ రప్పా రప్పా… మస్ట్ వాచ్ బెంగాలీ సిరీస్

OTT Movie : కాలేజ్ లో కొడుకు బలి… ఆ తల్లి తీర్చుకునే రివేంజ్ రప్పా రప్పా… మస్ట్ వాచ్ బెంగాలీ సిరీస్

OTT Movie : ర్యాగింగ్ ప్రధాన అంశంగా తెరకెక్కిన ఒక బెంగాలీ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ జాదవ్‌పూర్ యూనివర్సిటీలో జరిగిన ఒక నిజ జీవిత ర్యాగింగ్ సంఘటన ఆధారంగా రూపొందింది. ఇది ర్యాగింగ్ భూతానికి బలైన ఒక కొడుకు కోసం, ఒక తల్లి రివేంజ్ తీర్చుకునే థ్రిల్లింగ్ కథ. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


స్టోరీలోకి వెళ్తే

బిజోయా నైహాటిలో నివసించే ఒక వితంతువు. తన ఏకైక కొడుకు నీలాంజన్ తో జీవిస్తుంటుంది. నీలాంజన్ టాలెంట్ ఉన్న ఒక విద్యార్థి. కోల్‌కతాలోని ఒక పేరున్న ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరతాడు. ఇది బిజోయాకు చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఒక రోజు ఆమెకు షాకింగ్ వార్త వస్తుంది. నీలాంజన్ కాలేజ్ హాస్టల్ ఐదవ అంతస్తు నుండి పడి కోమాలోకి వెళ్తాడు. అధికారులు దీనిని ఆత్మహత్య ప్రయత్నంగా చెప్పినప్పటికీ, బిజోయా తన కొడుకు ఆత్మహత్య చేసుకోడని గట్టిగా నమ్ముతుంది. ఆమె నీలాంజన్ జీవితం కోసం ఆసుపత్రిలో పోరాడుతూనే, కొడుకు ఈ స్థితికి కారణం ఒక ర్యాగింగ్ ఘటన కారణమని తెలుసుకుంటుంది. వాళ్ళను శిక్షించాలనుకుంటుంది. ఈ పోరాటంలో ఆమెకు ఒక జర్నలిస్ట్ పూర్బా బెనర్జీ సహాయం అందిస్తాడు.


బిజోయా తన కొడుకు కోసం, న్యాయం కోసం పోరాడుతూ, శక్తివంతమైన వ్యక్తులైన సీనియర్ విద్యార్థి రికీ, అతని తండ్రి మిహిర్ గుప్తాను ఢీకొంటుంది. కళాశాల యాజమాన్యం, పోలీసులు ఈ సంఘటనను దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ బిజోయా వెనక్కి తగ్గదు. నీలాంజన్ రూమ్‌మేట్ ఆహన్ మైత్రా సహాయంతో, ఆమె ర్యాగింగ్ దారుణమైన వివరాలను, ఒక అవినీతి నెట్‌వర్క్‌ను బయటపెడుతుంది. ఆమెను చంపుతామని బెదిరింపులకు గురిచేస్తారు. ఈ పరిస్థితిలో బిజోయా తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందా ? వాళ్ళను శిక్షిస్తుందా ? ర్యాగింగ్ కు కారణం ఏమిటి ? ఒక మహిళ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటుంది ? అనే వివరాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ బెంగాలీ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

మూడు ఓటీటీలలో

‘బిజోయా’ (Bijoya) సాయంతన్ ఘోసల్ దర్శకత్వంలో రూపొందిన బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది హోయ్‌చోయ్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో 2024 జూలై 5న విడుదలైంది. ఈ సిరీస్‌లో స్వస్తికా ముఖర్జీ, దేబ్దుత్తా రహా, షాహెబ్ చటోపాధ్యాయ్, బిదిప్తా చక్రబర్తీ, రౌనక్ దే భౌమిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ హోయ్‌చోయ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

Related News

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈ వారం ఓటీటీలోకి ఒక్కో భాష నుంచి ఒక్కో మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్

OTT Movie : ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటుడికి ఛాన్స్… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ఇంట్రెస్టింగ్ గా రెండు తెలుగు మూవీస్..

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

Big Stories

×