OTT Movie : హారర్ సినిమాలకు అభిమానులు కూడా ఎక్కువే. దెయ్యాలను సినిమాలలోనే చూసి భయపడుతుంటాం. ఈ దెయ్యాలు ఉన్నాయా ? లేవా ? అనేది ఇప్పటికీ ఒక సమాధానం లేని ప్రశ్నే. ఈ డిజిటల్ యుగం వీటిని కొట్టి పారేస్తున్నా, అక్కడక్కడా జరిగే కొన్ని సంఘటనలు ఆలోచనలో పడేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా ఓటీటీలో ఆడియన్స్ చేత కేక పెట్టిస్తోంది. ఈ సినిమా ఒక ఆత్మ రివేంజ్ తీర్చుకునే సన్నివేశాల చుట్టూ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
వరుణ్, ఆర్య అనే ఒక కొత్తగా పెళ్లైన జంట, ఒక నగరంలో కొత్త అపార్ట్‌మెంట్‌లోకి మారతారు. వీడియో ఎడిటర్ అయిన వరుణ్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఆర్య సంతోషంగా జీవిస్తుంటారు. కానీ వారి కొత్త ఇంట్లో వింత సంఘటనలు మొదలవుతాయి. ఫోటో ఫ్రేమ్‌లు పడిపోవడం, కిటికీలు ఆటోమాటిగ్గా తెరుచుకోవడం, రాత్రిపూట వింత శబ్దాలు, కప్బోర్డ్‌లో నీడలు కనిపించడం వంటి ఘటనలు ఆర్యను భయపెడతాయి. వరుణ్ మొదట్లో ఈ సంఘటనలను హాలూసినేషన్స్‌గా తోసిపుచ్చినప్పటికీ, ఒక రోజు పనిమనిషి బిడ్డ రన్నింగ్ వాషింగ్ మెషీన్‌లో చిక్కుకోవడంతో అతనూ ఈ సంఘటనలను సీరియస్‌గా తీసుకుంటాడు. ఆర్య ఒక సైకిక్/ఎక్సార్సిస్ట్ అయిన డాక్టర్ రైమా దాస్ సహాయం తీసుకుంటుంది. ఈ ఆత్మ వరుణ్ గతంతో ముడిపడి ఉందని తెలుస్తుంది.
ఫ్లాష్‌బ్యాక్‌లో వరుణ్ గతంలో ఒక ఆకల్టిస్ట్ మహిళ కుమార్తె సరికాని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. ఆ గ్రామస్తులు ఆ మహిళను మంత్రగత్తెగా భావించి ఊరు నుంచి తరిమేస్తారు. ఆతరువాత సరికా చనిపోయి కనిపిస్తుంది. దీని వెనుక ఒక రహస్యం ఉంది. ఆమెను వరుణ్ సోదరుడు విక్రమ్ చంపినట్లు సూచనలు వస్తాయి. కానీ క్లైమాక్స్‌లో వరుణ్ దీనికి నిజమైన బాధ్యుడని బయటపడుతుంది. ఇప్పుడు సరికా ఆత్మ రివేంజ్ తీర్చుకోవడానికి వరుణ్‌ను వెంటాడుతూ, అతని సోదరుడిని చంపి, ఇప్పుడు వరుణ్, ఆర్యలను బెదిరిస్తుంది. రైమా ఒక బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్ ద్వారా ఆత్మను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మ ఇంకా ఇంట్లోనే ఉంటుంది. క్లైమాక్స్‌లో సరికా ఆత్మ వరుణ్‌ను చంపడానికి తిరిగి వస్తుంది. చివరికి ఈ ఆత్మ వరుణ్‌ను చంపుతుందా ? ఆర్య రిచ్యువల్ ఆత్మని బంధిస్తుందా ? ఈ స్టోరీ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
‘ది వైఫ్’ (The Wife) 2021లో విడుదలైన హిందీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. సర్మద్ ఖాన్ దర్శకత్వంలో, గుర్మీత్ చౌదరి (వరుణ్), సయానీ దత్తా (ఆర్య), శ్వేతా దధీచ్ (డాక్టర్ రైమా దాస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2021 మార్చి 19న ZEE5లో విడుదలై, 1 గంట 47 నిమిషాల రన్‌టైమ్‌తో, హిందీ ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
Read Also : అమ్మాయిలనే టార్గెట్ చేసే ఏలియన్… అర్ధరాత్రి బట్టలన్నీ విప్పి అలాంటి పని… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్