BigTV English

OTT Movie : ఇదెక్కడి వింత రోగం… సీను సీనుకో ట్విస్ట్ తో అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఇదెక్కడి వింత రోగం… సీను సీనుకో ట్విస్ట్ తో అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి  ఒక వేదికగా మారిపోయింది. భాషతో ప్రమేయం లేకుండా, నచ్చిన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే వీటిలో కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు, ప్రేక్షకులను స్క్రీన్ ముందు నుంచి కదలనీయకుండా చేస్తాయి. అంతలా కొన్ని సినిమాలు ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా,  ఫోబియా సమస్యను ఎదుర్కునే ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో  రాధిక ఆప్టే నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


జీ 5 (Zee 5) లో

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫోబియా’ (Phobia). 2016 లో వచ్చిన ఈ మూవీకి పవన్ కృపలానీ దర్శకత్వం వహించారు. నెక్ట్స్ జెన్ ఫిలిమ్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ల పై సునీల్ లుల్లా, విక్కీ ఈ మూవీని నిర్మించారు. ఇందులో రాధిక ఆప్టే, సత్యదీప్ మిశ్రా, అంకూర్ వికల్, యశస్విని దయామా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక ఆర్టిస్ట్ అయిన మెహక్ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ జీ 5 (Zee 5) లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

మెహక్ అనే మహిళ ఒక ఆర్టిస్ట్ వృత్తిలో ఉంటుంది. ఒక రాత్రి ఆమె టాక్సీలో ఇంటికి వెళుతుండగా, డ్రైవర్ ఆమెపై లైం*గిక దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ఆ ప్రమాదం నుండి తప్పించుకుంటుంది. అయితే ఈ గాయం ఆమెలో తీవ్రమైన ఫోబియాను తెచ్చిపెడుతుంది. దీని కారణంగా ఆమె ఇంటి నుండి బయటకు రావడానికి కూడా భయపడుతుంది. బహిరంగ ప్రదేశాలలో ఆమె వణికిపోతూ ఉంటుంది.

మెహక్ ను సాధారణ జీవితానికి తిరిగి తీసుకురావడానికి, ఆమె సోదరి, స్నేహితుడు షాన్ ప్రయత్నిస్తారు. ఒక ప్రత్యేకమైన థెరపీని కూడా చేస్తారు. అది అంతగా పని చేయకపోవడంతో, షాన్ ఆమెను ఒక కొత్త అపార్ట్‌మెంట్‌ కు తరలిస్తాడు. ఆమె ఒంటరిగా ఉండి తన భయాలను ఎదుర్కోవాలని అనుకుంటాడు. ఈ అపార్ట్‌మెంట్‌ లో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఒక ఎయిర్ హోస్టెస్ అయిన మునుపటి టెనెంట్, ఒకరోజు ఆశ్చర్యకరంగా కనిపించకుండా పోతుంది.

Read Also : మగాడి కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించిన మూవీ… పడి పడి నవ్విస్తూనే, ఏడిపించారు భయ్యా

ఇక మెహక్ కొత్త ఇంటికి అలవాటుపడటానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. ఆ ఇంటిలో వింత శబ్దాలు, నీడలు ఆమెను మరింత భయపెడతాయి. చివరికి ఆమెకు ఉన్న ఫోబియా నయం అవుతుందా ? అపార్ట్మెంట్ లో నిజంగా ఆత్మ ఉందా ? మెహక్ ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×