BigTV English

OTT Movie : ఇదేం చిత్రం మావా !? ఈ ఊళ్ళో చనిపోయిన వాళ్ళంతా తిరిగొస్తారు… వర్త్ వాచింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : ఇదేం చిత్రం మావా !? ఈ ఊళ్ళో చనిపోయిన వాళ్ళంతా తిరిగొస్తారు… వర్త్ వాచింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. తమకు నచ్చిన సిరీస్ లను, సమయం దొరికినప్పుడల్లా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోపోయే వెబ్ సిరీస్ లో చనిపోయిన మనుషులు తిరిగి ప్రాణాలతో వస్తుంటారు. ఈ రహస్యాన్ని కనిపెట్టే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే
ఐస్‌లాండ్‌ లోని వీక్ అనే చిన్న పట్టణంలో, కట్లా అనే ఒక అగ్నిపర్వతం ఉంటుంది. దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి చాలామంది అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంతమంది మాత్రం స్వస్థలాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడక, అక్కడే ఉండిపోతారు. కొద్దిమంది రెస్క్యూ వర్కర్లు, శాస్త్రవేత్తలు, స్థానిక రైతులు మాత్రమే అక్కడ మిగిలి ఉంటారు.

ఇక ఆ అగ్నిపర్వతం ఉన్నట్టుండి ఒక్కసారిగా, భీకరంగా బద్దలైపోతుంది. ఈ ఊహించని ఘటనతో బూడిద తుఫానులు వస్తాయి. దాంట్లో చాలా మంది ప్రజలు చనిపోతారు. ఆ తరువాత మరికొంత మంది పట్టణాన్ని వదిలి వెళ్లిపోతారు. ఇది జరిగిన ఒక సంవత్సరం తరువాత ఒక రోజు బూడిదతో కప్పబడిన అగ్నిపర్వతం నుండి, గున్‌హిల్డ్ అనే అమ్మాయి ప్రాణాలతో తిరిగి వస్తుంది. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. తను గ్రీమా అనే మహిళకు సోదరిగా గుర్తిస్తారు. ఆమె ఒక సంవత్సరం క్రితం ఈ అగ్నిపర్వతం పేలడంతో చనిపోయినట్లు అందరూ భావిస్తారు. గున్‌హిల్డ్ తిరిగి రావడం షాక్‌తో పాటు, మరిన్ని రహస్యాలను వెలుగులోకి తెస్తుంది.


గున్‌హిల్డ్ అనే మహిళ, 20 సంవత్సరాల క్రితం వీక్‌ లో హోటల్‌లో పని చేస్తూ ఉండేది. ఈ అగ్నిపర్వతం ప్రమాదంలో బూడిదలో సజీవంగా బూడిదలో కూరుకుపోతుంది. దీంతో అందరూ ఆమె చనిపోయింది అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రాణాలతో తిరిగి వస్తుంది. ఆ తరువాత ఇలా చనిపోయిన వారు చాలామంది ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి కనిపిస్తుంటారు.

ఈ రహస్యం ఏంటో కనిపెట్టడానికి జియాలజిస్ట్ దార్రి, అగ్నిపర్వతం దగ్గరికి వెళతాడు. అక్కడ ఒక పురాతన ఉల్క శిలను కనుగొంటాడు. ఈ ఉల్క కట్లా అగ్నిపర్వతం బూడిదతో కలిసి చనిపోయిన వాళ్ళని తిరిగి బతికిస్తూ ఉంటుంది. అసలు ఆ ఉల్క స్టోరీ ఏంటి? దానికి చచ్చిన వాళ్ళను బ్రతికించే శక్తి ఎలా వచ్చింది? చనిపోయిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావడానికి నిజంగా ఇదే కారణమా ? అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ సూపర్‌ నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కట్లా’ (Katla). 2021లో వచ్చిన ఈ సిరీస్ ను బాల్టసార్ కోర్మాకుర్, సిగుర్జోన్ క్జార్టన్సన్ కలసి రూపొందించారు. ఇందులో గుడ్రూన్ ఐర్ ఐఫ్జోర్డ్, ఇరిస్ తంజా ఫ్లైగెన్‌రింగ్, ఇంగ్వార్ సిగుర్డ్సన్, అలియెట్ ఓఫీమ్, బ్జోర్న్ థోర్స్ వంటి నటులు నటించారు. 8 ఎపిసోడ్‌ లు ఉన్న ఈ సిరీస్, ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల నిడివితో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీ స్టోరీ ఐస్‌లాండ్‌ లోని ‘కట్లా’ అనే అగ్నిపర్వతం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×