OTT Movie : ఓటీటీలో మలయాళ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. దాదాపు ఏడాదిన్నర తరువాత ఓ ఇంట్రెస్టింగ్ మలయాళ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. వణుకు పుట్టించే థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా కథేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…
ఏడాదిన్నర తరువాత స్ట్రీమింగ్
ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అస్త్ర’ (Asthra). ఈ మూవీ 2023 డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇది థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ OTTలో కొత్త ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. ఏడాదిన్నర తరువాత, వచ్చే శుక్రవారం అంటే జులై 18 నుంచి మనోరమ మ్యాక్స్ (Manorama Max) అనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. ‘అస్త్ర’ మూవీకి ఆజాద్ అలవిల్ దర్శకత్వం వహించారు. ఇది అతని డెబ్యూ ఫిల్మ్. స్క్రీన్‌ప్లే అండ్ డైలాగ్స్‌ను విను కె. మోహన్, జిజు రాజ్ రాశారు. సినిమాను ప్రేమ్ కల్లాట్, ప్రీనాంద్ కల్లాట్ పోరస్ సినిమాస్ బ్యానర్‌లో నిర్మించారు. మ్యూజిక్ మోహన్ సితారా చేశారు. ఇందులో సెంథిల్ కృష్ణ, సుహాసిని కుమరన్, కళాభవన్ షాజోన్, సుధీర్ కరమణ తదితరులు నటించారు.
కథలోకి వెళ్తే…
అస్త్ర కథ వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బాతెరీలో జరుగుతుంది. ఇక్కడ గత 48 గంటల్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను ఒక గ్యాంగ్ దాడి చేసి చంపేస్తుంది. ఈ హత్యలు చేసిన సమయంలో, నేరస్థులు రక్తంతో గోడపై ఒక బాణం గుర్తును గీస్తారు. ఈ కేసును ఛేదించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జోషీ మాథ్యూ (అమిత్ చక్కలక్కల్)ను అధికారులు సెలెక్ట్ చేస్తారు. అతను వినూత్న పద్ధతులతో నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఇప్పుడు ఈ హత్యల వెనుక ఉన్న గ్యాంగ్, వారి ఉద్దేశాలను గుర్తించడం జోషీ ముందున్న ప్రధాన లక్ష్యం.
Read Also : అవుట్ స్టాండింగ్ యాక్షన్ ఎలిమెంట్స్… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ కొరియన్ కోర్ట్ రూమ్ డ్రామా
కథ వయనాడ్ దట్టమైన అడవులు, హిల్స్ నేపథ్యంలో సాగుతుంది. ఇక్కడ రహస్యమైన సంఘటనలు తరచూ జరుగుతాయి. సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ స్టైల్, సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక జోషీ, తన బృందంతో కలిసి ఈ బాణం గుర్తుల వెనుక ఉన్న అర్థాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఇవి “అస్త్ర” అనే రహస్యమైన సింబల్స్ అని తేలుతుంది. జోషీ ఇన్వెస్టిగేషన్ లో నెమ్మదిగా ఈ గ్యాంగ్ చేసే దారుణమైన పనులన్నీబయటపడతాయి. ఇంతకీ ఆ హత్యలు చేసింది ఎవరు? జోషి వాళ్ళను ఎలా పట్టుకున్నారు? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ.