BigTV English
Advertisement

OTT Movie : దెయ్యం వస్తే డ్రమ్స్ కొట్టే బొమ్మ… ఒక్కో సీన్ కు గుండె గుభేల్… రాత్రిపూట చూడకూడని మూవీ

OTT Movie :  దెయ్యం వస్తే డ్రమ్స్ కొట్టే బొమ్మ… ఒక్కో సీన్ కు గుండె గుభేల్… రాత్రిపూట చూడకూడని మూవీ

OTT Movie : అతీంద్రియ, సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక ఐలాండ్ లో ఉండే భయంకరమైన ఇంటిలో ఈ స్టోరీ తిరుగుతుంది. ప్రతిక్షణం ఉత్కంఠంగా గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే


షడ్డర్‌ లో స్ట్రీమింగ్‌

‘కావియట్’ (Caveat) 2020లో విడుదలైన ఐరిష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఇది డామియన్ మక్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో జోనాథన్ ఫ్రెంచ్, లీలా సైక్స్, బెన్ కాప్లాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీ ఒక ఐలాండ్‌లోని పాడుబడిన ఇంట్లో జరుగుతుంది. ఈ చిత్రం 2020 అక్టోబర్ 4న ఇండీకార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2021 జూన్ 3న షడ్డర్‌ లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమా 1 గంట 27 నిమిషాల రన్ టైమ్ తో IMDb 5.9/10, రాటెన్ టొమాటోస్ లో 83% రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


స్టోరీలోకి వెళితే

ఐజాక్ (జోనాథన్ ఫ్రెంచ్) ఒక అమ్నీసియాక్ డ్రిఫ్టర్. అతనికి తన గతం గురించి ఏమాత్రం జ్ఞాపకం ఉండదు. అతనికి పరిచయస్తుడైన బారెట్ (బెన్ కాప్లాన్) అతనికి ఒక ఉద్యోగం ఆఫర్ చేస్తాడు. ఐర్లాండ్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో బారెట్ మేనకోడలు ఓల్గా (లీలా సైక్స్)ను కొన్ని రోజులు చూసుకోవాలి. ఓల్గా మానసిక జబ్బుతో బాధపడుతుంటుంది. ఆమె అప్పుడప్పుడు కాటటోనిక్ స్థితిలోకి వెళ్తుంది. ఈ ఉద్యోగం ఇతనికి మొదట అంత కష్టమైనదిగా అనిపించదు. ఐజాక్ కి డబ్బు అవసరం ఉండటంతో ఈ విచిత్రమైన డీల్ ను ఒప్పుకుంటాడు.

బారెట్, ఐజాక్‌ను ఒక చిన్న పడవలో ఆ ఐలాండ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఇల్లు చీకటిగా, శిథిలమైన, భయంకరమైన వాతావరణంతో ఉంటుంది. ఓల్గా అక్కడ మొదట కనిపించినప్పుడు, ఒక విచిత్రమైన గాజు కళ్లతో కూడిన డ్రమ్మింగ్ రాబిట్ టాయ్‌ను పట్టుకుని ఉంటుంది. ఆమె తండ్రి తీవ్రమైన క్లాస్ట్రోఫోబియాతో బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడని, ఆమె తల్లి అదృశ్యమైందని ఐజాక్ తెలుసుకుంటాడు.

Read Also : బ్లాక్ మ్యాజిక్ తో పుట్టగానే శాపం… ఊరినే అల్లాడించే ఆడపిల్ల… రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్

ఓల్గా స్థిమితం లేని ప్రవర్తన, ఇంట్లోని అతీంద్రియ సంఘటనలు ఐజాక్‌ను భయాందోళనకు గురిచేస్తాయి. అతను ఆ ఇంటిని పరిశీలిస్తూ, రాబిట్ డాల్ సహాయంతో బేస్‌మెంట్‌లో గోడ వెనుక ఓల్గా తల్లి మృతదేహాన్ని కనిపెడతాడు. బారెట్ ఆమె తండ్రిని, తల్లిని చంపాడని, తన తండ్రిని బేస్‌మెంట్‌లో బంధించి ఆత్మహత్య చేసుకునేలా చేసాడని ఓల్గా అతనికి చెప్తుంది. ఈ సమాచారంతో ఐజాక్ కి గతం గుర్తుకు వస్తుంది. అతను కూడా ఈ హత్యలలో పాల్గొన్నాడని తెలుస్తుంది.

ఐజాక్, ఓల్గా తల్లి మృతదేహం నుండి ఒక కీని తీసుకుని ఆమెను విడిపిస్తాడు. ఓల్గా తన కాటటోనిక్ స్థితిని ఉపయోగించి, అతన్ని క్రాస్‌బోతో కాల్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఐజాక్ ఆమెను బంధిస్తాడు. అతను బారెట్ ను కూడా బేస్‌మెంట్‌లో బంధిస్తాడు. అక్కడ మృతదేహం అతీంద్రియంగా కదలడం బారెట్ ను భయపెడుతుంది. ఇక క్లైమాక్స్ ఒక భయంకరమైన ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? ఆ శవం ఎందుకు కదులుతోంది ? ఐజాక్ గతం ఏమిటి ? ఆ ఇంటి రహస్యం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

OTT Movie : ప్లే గ్రౌండ్ లో చెయ్యి లేకుండా అమ్మాయి శవం… చెస్ట్ నట్ బొమ్మతో క్లూ వదిలే సైకో కిల్లర్ కిరాతకం..

OTT Movie : దెయ్యాన్ని వదిలించడానికెళ్లి దానితోనే దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : మ్యూజిక్ తో దెయ్యాన్ని నిద్రలేపే మెంటల్ పిల్ల… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం

OTT Movie : గోడ లోపల వింత శబ్దాలు… కట్ చేస్తే ఒళ్ళు జలదరించే ట్విస్ట్… ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా భయ్యా

Big Stories

×