OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. వీటిలో క్రైం థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్గా రిలీజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ మూవీ ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ చివరి వరకు సస్పెన్స్ తో ప్రేక్షకుల్ని కుర్చీలకి కట్టిపడేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video) లో
ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘చాల్చిత్రో’ (Chaalchitro). 2024 లో విడుదలైన ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ప్రతిమ్ డి. గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీ కోల్‌కతా నుండి వచ్చిన నలుగురు పోలీసుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారు మహా నగరాన్ని కదిలించిన వరుస హత్యల కేసును పరిశోధించడానికి వెళతారు. ఆ సైకో ఎవరు అనేది చివరి వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఒక సైకో పెళ్లి కూతురిలా అలంకరించి చంపుతాడు. ఈ కేసు నగరంలో హాట్ టాపిక్ గా మారుతుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ హత్యని చూసి షాక్ అవుతాడు. 12 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక సైకో కొంతమంది అమ్మాయిల్ని చంపి ఉంటాడు. ఆ తర్వాత హీరో అతన్ని అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి హత్యే జరిగింది. హీరో నజీర్, రితేష్ తో కలసి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇదివరకే ఇటువంటి హత్యలు చేసిన వ్యక్తి జైల్లోనే ఉంటాడు. అతడు చేసే అవకాశం లేనందున ఆలోచనలో పడతారు. ఈ సమయంలోనే మరొక హత్య కూడా జరుగుతుంది. ఆ అమ్మాయిని కూడా చంపి పెళ్లికూతురులా అలంకరించి ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. పెళ్లి పీటల వరకు వచ్చి ఈ అమ్మాయిల పెళ్లి ఆగిపోయి ఉంటుంది. అలా పెళ్ళిళ్ళు ఆగిపోయిన కొంతమంది లిస్ట్ ను రెడీ చేస్తారు. వాళ్ల మీద పోలీసులు నిఘా పెట్టినప్పుడు, ఒక సైకో ఒక అమ్మాయిని చంపడానికి వస్తాడు. అక్కడ నజీర్ ఒక్కడే ఉండటంతో, మిగతావాళ్లకు ఫోన్ చేస్తాడు. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతనొక్కడే లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి షాక్ అయ్యే విషయం కనిపిస్తుంది. ఆ సైకో అమ్మాయిని చంపి ఉంటాడు. అతన్ని పట్టుకునే లోగానే, ఆ సైకో నజీర్ని కూడా చంపేస్తాడు.
ఆ తర్వాత హీరో ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. రితేష్ తో గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయినట్లు. పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు ఒక వీడియో వైరల్ చేస్తాడు. అప్పుడు ఆ సైకో రితేష్ గర్ల్ ఫ్రెండ్ కోసం వస్తాడు. అప్పుడు పోలీసులు అతన్ని పట్టుకుంటారు. అతడు ఎంక్వయిరీ చేసేటప్పుడు దిమ్మతిరిగే విషయాలు బయటకి వస్తాయి. నిజానికి ఆ సైకో ఒక ప్రొఫెసర్ కొడుకు. ఇన్స్పెక్టర్ పొరపాటున ఇతని తండ్రిని 12 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో అనవసరంగా అరెస్టు చేస్తాడు. ఆ తర్వాత అతడు నిర్దోషి అని తెలిసి విడుదల అవుతాడు. ఈ అవమానం భరించలేక ప్రొఫెసర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఈ సైకో పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పటినుంచి వీడు ఒక సైకోగా మారి ఇలా చంపుతుంటాడు. ఇన్స్పెక్టర్ భార్యని కూడా కిడ్నాప్ చేసి ఒక శవపేటికలో పూడ్చి పెడతాడు. నీ భార్యని బ్రతికించుకో అని హీరోకి సవాల్ విసురుతాడు. చివరికి హీరో తన భార్య ను కాపాడుకుంటాడా? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.