ప్రపంచంలో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. వాటిలో ఒకటి.. మగ జీవి గర్భం దాల్చడం. మగ జీవి గర్భం దాల్చడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ప్రపంచంలో గర్భం దాల్చే ఏకైక మగ జీవి సీ హార్స్. ఇంతకీ మగ సీ హార్స్ ఎలా గర్భం దాల్చుతాయి? మగ జీవులు ప్రెగ్నెంట్ అయితే.. ఆడ జీవులు ఏం చేస్తాయి? అనే విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..
సీ హార్స్ లో విచిత్ర గర్భధారణ
సముద్ర గుర్రాలు ఒక రకమైన రివర్స్డ్ గర్భధారణను ప్రదర్శిస్తాయి. నిజానికి ఆడ సీ హార్స్ గుడ్లు పెడతాయి. కానీ, ఫలదీకరణ తర్వాత గుడ్లు అభివృద్ధి చెందడానికి ఆడ సీ హార్స్, మగ సీ హార్స్ సాయం తీసుకుంటాయి. మగ సీ హార్స్ లోని సంతానోత్పత్తి సంచిలోకి గుడ్లను బదిలీ చేస్తాయి. ఆ గుడ్లను జాగ్రత్తగా కాపాడి పిల్లలు అయ్యేలా మగ సీ హార్స్ సాయపడుతాయి. ఒక తండ్రిగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాయి. గుడ్లను జాగ్రత్తగా కాపాడంలో మగ జీవులు కీలక జాగ్రత్తలు తీసుకుంటాయి. గర్భధారణ సమయం సాధారణంగా 14 నుంచి 28 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత మగ సీ హార్స్ పిల్లలకు జన్మనిస్తాయి. వీటికి కొద్ది రోజుల పాటు మగ సీ హార్స్ ఆహారాన్ని అందిస్తుంది.
మగ సీ హార్స్ ఎందుకు గర్భం దాల్చుతాయి?
ఆడ సీ హార్స్ గుడ్లు పెట్టి వాటిని మగ సీ హార్స్ ల్లోని పొత్తి కడుపు మీద ఉన్న గర్భ సంచిలోకి చేరేలా చేస్తాయి. వీటిని సుమారు నెల రోజుల పాటు మోసి పిల్లలకు జన్మనిస్తాయి. ఆ తర్వాత మళ్లీ ఆడ జీవులు గుడ్లు పెట్టి మగ జీవికి అందిస్తాయి. ప్రతి సంభోగం తర్వాత సీ హార్స్ గుడ్లను మోసి పిల్లలకు జన్మను ఇవ్వాల్సి ఉంటుంది. ఇదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.
Read Also: ఇండియాలో సమోసా ధర రూ.20.. అమెరికాలో ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
అన్ని గుడ్లు పిల్లలు అవుతాయా?
వాస్తవానికి ఆడ సీ హార్స్ పెద్ద సంఖ్యలో గుడ్లు పెడతాయి. కానీ, అన్ని గుడ్లు పిల్లలుగా రూపాంతరం చెందవు. సుమారు ఒక్కో ఆడ సముద్ర గుర్రం సుమారు 10 వేల వరకు గుడ్లు పెడతాయి. కానీ, వాటిని సీ హార్స్ గర్భ సంచిలోకి పంపించడంలో సక్సెస్ కావు. వాటిలో కేవలం ఒక వెయ్యి గుడ్లను మాత్రమే గర్భ సంచిలోకి చేర్చుతాయి. మిగతా గుడ్లను నీళ్లలోకి వదిలేస్తాయి. వాటిని చేపలు సహా ఇతర సముద్ర జీవులు ఆహారంగా తీసుకుంటాయి. మగ సీ హార్స్ గర్భ సంచిలోకి చేరిన అన్ని గుడ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అవి చక్కగా పొదగబడి పిల్లలుగా తయారు అవుతాయి. సుమారు నెల రోజుల్లోనే పిల్లలుగా తయారై బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతాయి. కొద్ది రోజుల్లోనే మళ్లీ మగ సీ హార్స్ గర్భాన్ని దాల్చుతాయి.
Read Also: రొయ్యలకు బాగా మద్యం తాగించి.. మలమల మరిగే నూనెలో వేసి.. ఇది ఎక్కడ దొరుకుతుందంటే?