Telugu legal crime thriller: తెలుగులో కోర్టు రూమ్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చినా కొన్ని మాత్రమే కథ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. అలాంటి సిరీస్ ల లిస్ట్ లో ఉండే మరో తెలుగు లీగల్ వెబ్ సిరీసే ‘అబ్జెక్షన్ మై లార్డ్’ (Objection My Lord). టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ లీగల్ క్రైమ్ థ్రిల్లర్‌లో కోర్టు వాదనలు, రాజకీయ ఒత్తిళ్లు, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ ముగిసే సరికి, నెక్స్ట్ ఏం జరుగుతుందా ? అనే ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించడం ఈ సిరీస్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ. మరి ఈ సిరీస్ నిజంగా వర్త్ వాచేనా ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన కిడ్నాప్ కేసుతో కథ ప్రారంభమవుతుంది. మొదట రొటీన్ నేరంలా కనిపించిన ఈ కేసు, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ కేసు కోర్టుకు చేరడంతో అసలు కథ మొదలవుతుంది. నిందితుడి తరఫున వాదించేందుకు రంగంలోకి దిగిన ప్రముఖ డిఫెన్స్ లాయర్ తన అనుభవంతో కేసును కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తాడు.
కోర్టులో ప్రాసిక్యూషన్ చెప్పే ప్రతి వాదనకు అతను బలమైన ఆధారాలతో ఎదురు నిలుస్తాడు. ఒకవైపు పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, మరోవైపు కోర్టులో బయటపడే కొత్త నిజాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఈ కేసు వెనుక కేవలం కిడ్నాప్ మాత్రమే లేదని, కిడ్నాప్ ముసుగులో మరింత పెద్ద కుట్ర దాగి ఉందనే సంకేతాలు ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి.
ఇదే సమయంలో రాజకీయ నాయకులు, మైనింగ్ మాఫియా, అధికార వ్యవస్థకు చెందిన కొందరు వ్యక్తుల పాత్ర కూడా ఒక్కొక్కటిగా బయట పడుతుంది. అయితే నిజంగా వీళ్లలో అసలు సూత్రధారి ఎవరు ? కోర్టులో వినిపిస్తున్న వాదనలు నిజమా ? లేక ఎవరో పక్కా ప్లాన్‌తో అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారా ? అనే సందేహాలు ప్రతి ఎపిసోడ్‌తో పెరుగుతాయి.
కథ క్లైమాక్స్ కు చేరే కొద్దీ ప్రతి పాత్ర వెనుక ఉన్న ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయట పడుతుంటాయి. కానీ అసలు ట్విస్ట్‌ను మాత్రం దర్శకుడు క్లైమాక్స్ వరకు దాచిపెట్టాడు. చివరికి కిడ్నాప్ వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరు ? శ్రీకాంత్ పోషించిన లాయర్ తన క్లయింట్‌ను నిజంగానే కాపాడగలిగాడా ? కోర్టులో జరిగిన చివరి వాదన కేసు తీర్పును ఎలా మార్చింది ? అనే విషయాలను మాత్రం సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
‘అబ్జెక్షన్ మై లార్డ్’ ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న ఈ లీగల్ క్రైమ్ థ్రిల్లర్‌లో శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించగా, పృథ్వీరాజ్, సమీర్, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. కోర్టు రూమ్ డ్రామా, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అంశాలను మిక్స్ చేస్తూ ఈ సిరీస్‌ను రూపొందించారు. కోర్టులో జరిగే మైండ్ గేమ్స్, బలమైన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ నటన ఈ సిరీస్‌లో హైలెట్ అన్పిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త మలుపులు, కోర్టులో జరిగే వాదనలు, కేసు వెనుక దాగి ఉన్న రహస్యాలు ప్రేక్షకుడిని చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెడతాయి. ఈ వీక్ లో ఒక మంచి తెలుగు లీగల్ థ్రిల్లర్ చూడాలని అనుకుంటే, జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను డోంట్ మిస్.
Read Also: నవ్వుతో చంపే వైరస్… బ్యాట్‌మ్యాన్‌కు జోకర్ షాక్… క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్