OTT Movie : మలయాళం సినిమాలకు ఇప్పుడు ఓటీటీలో డిమాండ్ ఎక్కువగా ఉంది. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో యూత్ కి పిచ్చెక్కించే సీన్స్ బాగానే ఉన్నాయి. సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
సైనా ప్లే (Saina Play) లో
ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ పేరు ‘చతురం’ (Chathuram). 2022 విడుదలైన ఈ సినిమాకి సిద్ధార్థ్ భరతన్ దర్శకత్వం వహించారు. ఇందులో స్వసికా విజయ్ (సెలీనా), రోషన్ మాథ్యూ (బాల్తాజార్), అలెన్సియర్ లే లోపెజ్ (ఎల్దో), సాంతి బాలచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక యువతి సెలీనా చుట్టూ తిరుగుతుంది. ఆమె తన జీవితంలో ఎదుర్కొనే వ్యక్తులు, పరిస్థితుల పట్ల స్పందిస్తూ, ప్రేమ, ప్రతీకారం అనే ఆటను ఆడుతుంది. 2 గంటల 27 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 6.1/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా సైనా ప్లే (Saina Play) లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
సెలీనా అందమైన మహిళ, తనకు రెట్టింపు వయస్సు ఉన్న ఎల్దో అనే ఒక డబ్బున్న శాడిస్ట్ ను పెళ్ళి చేసుకుంటుంది. వీళ్ళు ఒక హిల్ స్టేషన్‌లోని బంగ్లాకు వెళ్తారు. అక్కడ ఎల్దో తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు. అతను చిన్న చిన్న కారణాలతో సెలీనాను హింసిస్తాడు. ఆమెకు శారీరకంగా, మానసికంగా నరకం చూస్తాడు. ఆమెను అతని కంట్రోల్ లో పరట్టుకుంటాడు. సెలీనా తన అందం, తెలివిని ఉపయోగించి, ఈ కష్టమైన పరిస్థితి నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుంది.ఒక రోజు, ఎల్దో ఒక ప్రమాదంలో చిక్కుకుని పక్షవాతంతో బాధపడతాడు. అతను పడక్కి పరిమితం అవుతాడు. ఈ సమయంలో, సెలీనా ఎల్దో సంపద, ఆస్తుల నిర్వహణను తీసుకుంటుంది.
ఈ సమయంలో ఎల్దోను చూసుకోవడానికి బాల్తాజార్ అనే ఒక హోమ్ నర్స్ నియమించబడతాడు. అయితే అతను సెలీనా అందానికి పడిపోతాడు. వెంటనే వారిద్దరి మధ్య ఒక సంబంధం ప్రారంభమవుతుంది. సెలీనా, తన బాధలకు ప్రతీకారం తీర్చుకోవడానికి, బాల్తాజార్‌ను మానసికంగా శారీరకంగా మానిపులేట్ చేస్తూ ఒక చదరంగం ఆటను ఆడుతుంది. ఇక సెలీనా ఎల్దో నుండి విముక్తి పొందడమే కాకుండా, అతని సంపదను తన స్వాధీనం చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తుంది. బాల్తాజార్, సెలీనా మాయలో చిక్కుకుని, ఆమె పథకంలో పలు పంచుకుంటాడు. చివరికి సెలీనా ఎలాంటి పధకం వేస్తుంది ? బాల్తాజార్‌ను ఏ విధంగా వాడుకుంటుంది ? ఎల్దో ఆస్తిని ఎలా సొంతం చేసుకుంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : బ్యాచిలర్స్ తో ఆడుకునే ఆడ దెయ్యం… ఈ మలయాళ కామెడీ కమ్ హర్రర్ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్