E-Paper
Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న చెన్నై లవ్ స్టోరీ!

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న చెన్నై లవ్ స్టోరీ!
Advertisement

Chennai Love story: ఇటీవల థియేటర్లలో విడుదలైన ప్రతి చిత్రం కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే భారీ బడ్జెట్ చిత్రాలను మొదలుకొని చిన్న చిత్రాల వరకు ప్రతీదీ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తూ .. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. అదేదో కాదు బేబీ చిత్రంతో దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాయి రాజేష్ కథను అందిస్తూ జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం (Kiran abbavaram), శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya) జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న చెన్నై లవ్ స్టోరీ..

రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా సుమారుగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో విశేష ఆదరణ పొందిన ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ సోనీ సొంతం చేసుకుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 21 నుండి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై మేకర్స్, ఓటీటీ అధికారిక ప్రకటన చేయనుంది.

Advertisement

ALSO READ:ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!

చెన్నై లవ్ స్టోరీ సినిమా కథ..

చెన్నై లవ్ స్టోరీ సినిమా విషయానికి వస్తే.. సినిమా రంగంలో తన ప్రతిభను చాటుకొని.. ఎప్పటికైనా వెండితెరపై దర్శకుడిగా పేరును చూసుకోవాలనే బలమైన ఆశయంతో చెన్నై మహానగరంలో అడుగుపెడతాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). ఆయన ఒక అనాథ. అవకాశాల వేటలో ప్రతిరోజు కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ.. తన లక్ష్యం దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటాడు. మరొకవైపు నివి (శ్రీ గౌరీ ప్రియ), అజయ్ (త్రిగుణ్) ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుని, వివాహ బంధంతో ఒక్కటి కావాలని భావిస్తారు. అయితే ఊహించని విధంగా పెళ్లికి ముందే నివిని ఒంటరి చేసి అజయ్ వెళ్లిపోవడంతో.. ఆమె జీవితం ఒక్కసారిగా అతలాకుతులమవుతుంది..ఆ తీవ్రమైన మనోవేదనను తట్టుకోలేక , మానసిక కుంగుబాటుకు లోనవుతుంది. అదే సమయంలో మద్యానికి బానిస అవుతుంది.

ఆ మలుపుల సారాంశమే అసలు కథ..

Advertisement

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చెన్నై బ్యాక్ డ్రాప్ లో నివి జీవితంలోకి స్టీవెన్ శంకర్ అడుగుపెడతాడు. అనుకోకుండా నివి అందించిన ఒక చిన్న సహాయం స్టీవెన్ హృదయాన్ని తాకడంతో అతడు ఆమెను ఆరాధిస్తాడు. ఆ పరిచయంతో మొదలైన వీరి బంధం నెమ్మదిగా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. ఘాడమైన ప్రేమగా రూపాంతరం చెందుతుంది. ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో నివి జీవితంలో గతానికి సంబంధించిన మలుపులు మళ్లీ ఎదురవుతాయి. అసలు నివిని ప్రాణంగా ప్రేమించిన అజయ్ ఎందుకు మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. గతంలో చేదు జ్ఞాపకాలు మళ్లీ తెరపైకి వచ్చినప్పుడు స్టీవెన్ , నివిల ప్రేమ కథ ఎలాంటి ముగింపుకు చేరుకుంది. అనేది దర్శకుడు చాలా ఎమోషనల్ గా ఆవిష్కరించారు. మొత్తానికైతే ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇటు ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×