E-Paper
Advertisement

20 రోజులుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్ రవి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి! ఇంతకీ ఏమైంది?

20 రోజులుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్ రవి.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి! ఇంతకీ ఏమైంది?
Advertisement

Army jawan missing: పాము పగడుతుందా? ఎక్కడున్నా సరే వెంటాడి కాటేస్తుందా?.. అదంతా తూచ్‌. తన జోలికి వస్తే బుస కొడుతుందే కానీ పగపట్టదు. ఇంకా చెప్పాలంటే ఎవరి కంట పడకుండా తన దోవ తాను చూసుకుంటుంది. నెల్లూరు జిల్లా తోటలపల్లిచెరువు గ్రామంలో ఓ పాము రోడ్డును క్రాస్‌ చేసిందిలా. ఇలాంటి పాములకు కోరల్లో మాత్రమే విషం వుంటుంది. మరి నిలువెల్లా విషం వున్నా మనుషుల్లారా ఈ సమాజంలో??. ఎవరేం పగ పట్టారో కానీ .. చెట్టంత నా బిడ్డను మాయంచేశారని ఓ అమ్మ గుండె కన్నీరైంది

20 రోజులైనా ఎలాంటి అప్‌డేట్ లేదు..

Advertisement

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని తోటలపల్లి చెరువుకుచెందిన పగడాల రవి.. ఆర్మీ జవాన్‌. డ్యూటీ మణిపూర్‌ రాష్ట్రంలో. 20 రోజుల కిందట సెలవు పెట్టి సొంతూరుకు బయలుదేరారు. తను వస్తుకున్నట్టు కుటుంబానికి, బంధుమిత్రులకు ఫోన్‌ చేసిచెప్పాడు. ఆయన రాక కుటుంబం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. వస్తానన్న టైమ్‌ రాలేదు. డేట్‌ మారుతున్న జాడలేదు. ఫోన్‌చేస్తే రెస్పాన్స్‌ లేదు. కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఎంక్వయిరీ చేపట్టారు. కానీ 20 రోజులైనా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కన్పించుటలేదని వాట్సాప్‌లో ఇలా మెసేజ్‌ సర్క్యూలేట్‌ చేశారు. ఆచూకీ చెప్పిన వారికి 3 లకల నజరానా ఇస్తామని ప్రకటించారిలా.

అసలు రవికి ఏమైంది..?

Advertisement

గత నెల 19న నాగాలాండ్‌లోని ధీమాపూర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రవి తన భార్య వరలక్ష్మి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ తరువాత నుంచి ఎలాంటి కాల్స్‌ రాలేదు. పోలీసులు ట్రాక్‌ చేస్తే,, లాస్ట్‌ సిగ్నల్‌ ఒడిశాలోని భద్రక్‌ వరకు ఫోన్‌ ఆన్‌లోనే ఉన్నట్టు తేలింది. బెంగళూరులో రైల్వే స్టేషన్‌లో రవి ఐడీ కార్డు.. బ్యాక్‌ లభించాయి. మరి అతనెక్కడ? రవికి ఏమైంది?

Also Read: లోకేష్ రాజీనామా వరకు ‘జెన్ జీ’ పోరాటం ఆగేది లేదు.. MLC చంద్రశేఖర్ రెడ్డి

పోలీసులకు సవాల్‌గా మారిన రవి అదృశ్యం..

జవాన్‌ పగడాల రవి అదృశ్యం పోలీసులకు సవాల్‌గా మారింది. రవి ఊరికి వస్తున్నాడని తెలిసే ఎవరైనా పక్కా పథకంతో అతన్ని కిడ్నాప్‌ చేశారా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. గ్రామంలో కొందరితో భూవివాదాలున్నాయన్నారు కుటుంబసభ్యులు. ఆ గొడవలకు పగడాల రవి అదృశ్యానికి లింక్‌ వుందా? లేదంటే మిస్సింగ్‌ వెనుక మరేదైనా మిస్టరీ వుందా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Tags

Related News

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

Big Stories

Advertisement
×