Ind vs Aus: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ పూర్తయింది. ఇవాళ ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య చిట్ట చివరి టీ20 జరగనుంది. మూడు వన్డేల సిరీస్ ఓడిపోయిన ఇండియా, ఇవాళ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇవాళ మూడవ టి20 లో ఓడిపోతే, టీమిండియా ఈ సిరీస్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
Also Read: Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫర్..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 ( Australia vs India, 3rd T20I) మ్యాచ్ బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ ( Bellerive Oval, Hobart) వేదికగా జరగనుంది. ఎప్పటి లాగే మధ్యాహ్నం 1:45 గంటలకు ఈ రెండు జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. 1:15 గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా వర్షం పడే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి నేపథ్యంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. రెండో టి20 లో కూడా వర్షం పడింది. దీనికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియా సెకండ్ బ్యాటింగ్ చేసి, విజయం సాధించింది. ఇవాళ టాస్ టీమిండియా గెలిస్తే, కచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలి. లేకపోతే మళ్లీ ఆస్ట్రేలియా గెలిచే ప్రమాదం ఉంది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఇవాల్టి చివరి టీ20 మ్యాచ్ లో ఖచ్చితంగా అర్షదీప్ ను ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకపోతే గౌతమ్ గంభీర్ చీల్చి చెండాడుతామని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, కుల్దీప్ యాదవ్ పై వేటు వేసి అర్షదీప్ సింగ్ ను జట్టులోకి తీసుకునేందుకు గంభీర్ మరో స్కెచ్ వేశాడట. హర్షిత్ రాణా మాత్రం తుది జట్టులో కచ్చితంగా ఉంటాడని సమాచారం.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 ల బలాబలాలు చూసుకున్నట్లయితే… టీమిండియా పై చేయి సాధించింది. వన్డేలలో ఆస్ట్రేలియా ఎక్కువ విజయాలు నమోదు చేసుకుంటే, టీ20లలో మాత్రం టీమిండియానే రారాజు. ఇప్పటి వరకు జరిగిన 32 మ్యాచ్ లలో టీమిండియా ఏకంగా 20 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా కేవలం 11 మ్యాచ్ లలో విజయం సాధించడం గమనార్హం.
Also Read: Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?
భారత్ అంచనా: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్), అక్షర్ పటేల్, శివమ్ దూబే/రింకూ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్/అర్ష్‌దీప్ , వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా అంచనా: 1 మిచెల్ మార్ష్ (కెప్టెన్), 2 ట్రావిస్ హెడ్, 3 జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), 4 టిమ్ డేవిడ్, 5 గ్లెన్ మాక్స్వెల్, 6 మిచెల్ ఓవెన్/మాథ్యూ షార్ట్, 7 మార్కస్ స్టోయినిస్, 8 జేవియర్ బార్ట్‌లెట్, 9 నాథన్ ఎల్లిస్, 10 సీన్ అబాట్/మహ్లి బియర్డ్‌మాన్, 11 మాట్ కుహ్నెమాన్.