OTT Movie : ఇండోనేషియన్ నుంచి వచ్చే హారర్ సినిమాల గురించి ప్రత్యేకంగా, చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ సినిమాలలో హారర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. చేతబడులను చూపించడంలో ఈ దర్శకులు అందరికన్నా ముందే ఉంటారు. అక్కడ ఎక్కువగా ఇటువంటి సినిమాలనే తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక మహిళ దెయ్యం వల్ల పిల్లల్ని కంటుంది. ఆ తరువాత స్టోరీ రసవత్తరంగా నడుస్తుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు’సుమల’ (Sumala). 2024 లో విడుదలైన ఈ మూవీకి రిజల్ మంతోవానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెమరాంగ్ అనే ఒక గ్రామంలో జరిగిన ఒక భయంకరమైన జానపద కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ కథలో సుమల అనే పేరు గల ఆత్మ, గ్రామస్తులను భయపెడుతూ ఉంటుంది. రాత్రి సమయంలో, ఆ ఊరిలో ఎవరూ బయటకు రాకుండా ఉంటారు. ఎందుకంటే సుమల వచ్చి చంపుతుందని అక్కడ ఉన్నవాళ్ళు నమ్ముతుంటారు. అక్కడ జరిగే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా సాగుతుంటాయి. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
1948 లో సోద్జిమన్, సులస్త్రీ అనే ధనవంతులైన దంపతులు, సెమరాంగ్ అనే గ్రామంలో నివసిస్తుంటారు. వీరి 11 సంవత్సరాల వివాహ జీవితం లో సంతానం మాత్రం కలగకుండా ఉంటుది. సోద్జిమన్ తన ఆస్తిని కాపాడుకోవడానికి వారసుడు కావాలని కోరుకుంటాడు. ఒకవేళ సులస్త్రీకి పిల్లలు పుట్టకపోతే, అతను మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. ఈ ఒత్తిడితో సులస్త్రీ ఒక మాంత్రికుణ్ణి కలుస్తుంది. అతని ద్వారా ఆమె ఒక దెయ్యంతో ఒప్పందం చేసుకుంటుంది. ఈ ఒప్పందం ప్రకారం, సులస్త్రీ గర్భవతి అవుతుంది. కానీ ఆమె పుట్టిన పిల్లలలో ఒకరిని 10 సంవత్సరాల వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ క్రమంలో, సులస్త్రీ కుమల, సుమల అనే కవలలకు జన్మనిస్తుంది. కుమల మంచిగా ఉంటుంది. కానీ సుమల వికృతంగా పుడుతుంది. దీంతో సోద్జిమన్ ఆమె వికృత రూపాన్ని చూడలేక చంపేస్తాడు. ఇది దెయ్యంతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి దారితీస్తుంది.
ఆతరువాత దీని కారణంగా కుమల శారీరకంగా, మానసికంగా లోపాలతో పెరుగుతుంది. ఆమె తన తల్లిదండ్రుల నుండి, గ్రామస్తుల నుండి ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. కుమల శరీరంలోకి చనిపోయిన సోదరి సుమల ఆత్మ తిరిగి వస్తుంది. ఆమె తన సోదరిని బాధపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.ఇప్పుడు సుమల ఆత్మ కుమల శరీరాన్ని ఆవహిస్తుంది. దీనివల్ల ఆమె వింతగా ప్రవర్తిస్తుంది. గ్రామంలో కూడా భయంకరమైన మరణాలు సంభవిస్తాయి. సోద్జిమన్, సులస్త్రీ తమ చర్యల వల్ల వచ్చిన ఈ శాపాన్నిఘోరంగా ఎదుర్కోవలసి వస్తుంది. చివరికి సుమల ఆత్మ కుమలను విడిచి పెడుతుందా ? ఈ భయంకరమైన సంఘటనలను ఊరి ప్రజలు ఎలా ఎదుర్కుంటారు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఇండోనేషియన్ హారర్ మూవీని చూడాల్సిందే.