BigTV English

OTT Movie : పెళ్ళైన టీచర్ తో ప్రేమ… చివర్లో బుర్రపాడు ట్విస్ట్… మెంటలెక్కించే తమిళ థ్రిల్లర్

OTT Movie : పెళ్ళైన టీచర్ తో ప్రేమ… చివర్లో బుర్రపాడు ట్విస్ట్… మెంటలెక్కించే తమిళ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కరోనా తరువాత ఓటీటీలలకు ఎంతటి ఆదరణ పెరిగిందో, మలయాళ సినిమాలకు అంతకంటే ఎక్కువే పెరిగింది. అయితే అందులోనూ ప్రేమలు వంటి ఫ్రెష్ లవ్ స్టోరీలు ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు అలాంటి మరో మలయాళ మూవీ గురించే చెప్పుకోబోతున్నాము. ఆ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ మూవీ పేరు “క్రిస్టీ” (Christy). 2023లో విడుదలైన మలయాళ రొమాంటిక్ డ్రామా ఇది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ (Sonyliv), ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే వంటి 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆల్విన్ హెన్రీ తన రియల్ లైఫ్ ఆధారంగా రూపొందించాడు. ఇది కేరళలోని పోవర్ అనే సుందరమైన తీర ప్రాంత గ్రామంలో జరిగే ఒక టీనేజ్ అబ్బాయి, అతని ట్యూటర్‌గా ఉన్న పెద్ద వయసు స్త్రీ మధ్య జరిగే ప్రేమ కథ. ఈ సినిమా లవ్, డ్రామా, కామెడీ లతో కలగలిపి, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, గోవింద్ వసంత సోల్‌ఫుల్ సంగీతంతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. అయితే థియేటర్లలో ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో మాత్రం బాగానే ఆకట్టుకుంటోంది. అయితే కథలోని కొన్ని సన్నివేశాలపై మాత్రం విమర్శలు వచ్చాయి. ఇందులో మాళవిక మోహనన్ (క్రిస్టీ), మాథ్యూ థామస్ (రాయ్), స్మిను సిజో (లిస్సీ), వీనా నాయర్, మంజు పత్రోస్ ప్రధాన పాత్రలు పోషించారు.


కథలోకి వెళ్తే…

2007లో కేరళలోని పోవర్‌లో జరిగే ఈ కథ రాయ్ (మాథ్యూ థామస్) అనే 12వ తరగతి విద్యార్థి చుట్టూ తిరుగుతుంది. రాయ్ తన అత్త ఇంట్లో ఉంటాడు. కానీ చదువులో వెనుకబడి, తరచూ క్లాసులను ఎగ్గొడుతూ ఉంటాడు. అతని తల్లి లిస్సీ ఈ అబ్బాయి సరిగ్గా చదువకాపోతే ఇంటికి తిరిగి రమ్మని హెచ్చరిస్తుంది. దీంతో అతని అత్త, రాయ్‌ను క్రిస్టీ (మాళవిక మోహనన్) అనే ట్యూటర్ వద్ద చదువుకోమని పంపిస్తుంది.

క్రిస్టీ రీసెంట్ గా విడాకులు తీసుకున్న అమ్మాయి. అలాగే ఆమె నుండి తరచూ డబ్బు అరువు తీసుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. రాయ్ మొదట క్రిస్టీని కలిసినప్పుడు, ఆమె విచారంగా ఉండటం గమనిస్తాడు. కానీ తల్లి ఒత్తిడితో ఆమె వద్ద చదువుకోవడం కొనసాగిస్తాడు. వారి ట్యూషన్ సెషన్‌ల సమయంలో, రాయ్ క్రిస్టీ పట్ల ఆకర్షితుడై, వారి స్నేహం బలపడుతుంది. రాయ్ తన పరీక్షలో పాస్ అవుతాడు. ఇక కాలేజీ విద్యార్థిగా మారిన రాయ్, క్రిస్టీని ప్రేమిస్తున్నట్లు వెల్లడిస్తాడు. అయితే అదే టైంలో క్రిస్టీ మాల్దీవులలో టీచర్ గా ఉద్యోగం పొందడానికి రెండు లక్షల రూపాయలు అవసరమని తెలుస్తుంది. దీంతో ఆమె తండ్రి సీరియస్ అవుతాడు. ఇక రాయ్ తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు క్రిస్టీ ఆశ్చర్యపోతుంది.

హీరోయిన్ మొదటి రోజు ఉద్యోగంలో ఎయిర్‌పోర్ట్‌లో రాయ్ ఆమెను కలుస్తాడు. రాయ్ తన జన్మదినం రోజు క్రిస్టీని ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె తిరస్కరిస్తుంది. మరి ఆ తరువాత ఆ టీనేజ్ అబ్బాయి ఏం చేశాడు? హీరోయిన్ ఎందుకు ఆ అబ్బాయిని రిజెక్ట్ చేసింది? లాస్ట్ ట్విస్ట్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

Read Also : దెయ్యాన్ని వదిలించే వాళ్ళకే దెయ్యం పడితే… ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉన్న హర్రర్ మూవీ

Related News

OTT Movie : మనుషుల్ని ముట్టుకోలేని వింత జబ్బు… ఇలాంటి వాడితో రొమాన్స్ ఎలా భయ్యా ? క్రేజీ కొరియన్ సిరీస్

OTT Movie : మిస్టీరియస్ మనిషితో రొమాన్స్… వల్లకాడుగా మారే ఊరు… మైండ్ బెండింగ్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : రాక్షసుడికి ఆత్మను అమ్మేసి దెయ్యలతో ఆ పని… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్… క్రేజీ హర్రర్ సిరీస్

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×