OTT Movie : హర్రర్ సినిమాలలో ఈ సినిమా వేరు. ఎందుకంటే ఏకంగా ఓ అమ్మాయి తన చెల్లిని చంపిందనే కోపంతో దెయ్యంపైనే పగబడుతుంది. అలాగే దానికి చుక్కలు చూపిస్తుంది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు. మరి హర్రర్ మూవీ లవర్స్ కు ఫీస్ట్ అయిన ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో చూద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…
ఈ హర్రర్ మూవీ పేరు “డెత్ విస్పరర్ 2” (Death Whisperer 2). థాయ్ భాషలో “థీ యోడ్ 2” (Tee Yod 2) అని పిలుచుకునే ఈ 2024 థాయ్ సూపర్ నాచురల్ హారర్-యాక్షన్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంది. 2023లో విడుదలైన “డెత్ విస్పరర్” చిత్రానికి సీక్వెల్‌గా, ఈ సినిమా థాయ్‌లాండ్‌లోని ఒక గ్రామీణ నేపథ్యంలో చీకటి శక్తులు, దెయ్యాలతో పోరాడే ఒక కుటుంబం కథను కంటిన్యూ చేస్తుంది. ఈ చిత్రం మొదటి పార్ట్ కంటే ఎక్కువ యాక్షన్, హారర్ థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకుంటుంది. ఇందులో నడెచ్ కుగిమియా (యాక్), డెనిస్ జెలిల్చా కప్పున్ (యాడ్), కజ్బుండిట్ జైడీ (యోస్), రత్తనవాదీ వాంగ్‌థాంగ్ (యామ్), నట్చా నీనా జెస్సికా పడోవాన్ (యీ), అరిసర వాంగ్‌చలీ, ప్రమేట్ నోయ్-ఆమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
కథలోకి వెళ్తే…
1975లో మొదటి చిత్రం “డెత్ విస్పరర్” లో యామ్‌ను చంపిన పుయాంగ్ దెయ్యం (ఒక దెయ్యం స్త్రీ) భయంకరమైన శక్తుల నుండి కుటుంబాన్ని రక్షించేందుకు హీరోయిన్ ఎలా పోరాడింది అన్నదే ఈ మూవీ స్టోరీ. 1854లో యుద్ధంలో గాయపడిన సైనికుడు పుయాంగ్ ఒక దెయ్యంతో ఒప్పందం కుదుర్చుకుని, ఆమె ఆత్మకు హోస్ట్‌గా మారతాడు. ఆ తర్వాత ఆమె అతనిని కంట్రోల్ చేస్తూ, అనేక మందిని చంపుతుంది. మొదటి చిత్రంలో యామ్ మరణించిన మూడేళ్ల తర్వాత, యాక్ (నడెచ్ కుగిమియా), తన సోదరి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో, దుష్ట శక్తుల వేటగాడిగా మారతాడు.
యాక్ తన సోదరులు యాడ్, యోడ్, యీ, యోస్‌లతో కలిసి ఈ దెయ్యంతో పోరాడుతాడు. ఇందులో పాము ఒక వ్యక్తి కంటిని కొరకడం, తలలు పేలిపోవడం, శరీరాలు చీలిపోవడం వంటి అత్యంత భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. మరి ఇంతకీ తమ చెల్లి మరణానికి కారణమైన ఆ దెయ్యంపై పగ తీర్చుకున్నారా? ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నారు? దెయ్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలిగారు? అనే విషయాలను ఓటీటీలో చూడాల్సిందే. ఇందులో బ్లడ్ బాత్ ఎక్కువగా ఉంది కాబట్టి, చిన్న పిల్లలు లేని టైంలో చూస్తే బెటర్. హర్రర్ మూవీ లవర్స్ ను ఈ మూవీ ప్రతి క్షణం ఓ ట్విస్ట్ తో ఆకట్టుకుంటుంది. కాబట్టి అస్సలు డిసప్పాయింట్ కారు. కాకపోతే వయొలెన్స్ ఎక్కువగా ఉంది. వాటిని చూసే ధైర్యం లేనివారు స్కిప్ చేయొచ్చు.
Read Also : పెళ్ళైన అమ్మాయిలతోనే మగ దెయ్యం పాడు పనులు… కల్లోకి వచ్చి మరీ ఈ అరాచకం ఏంటి భయ్యా ?