Subham Movie Review : స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ‘శుభం’ అనే సినిమా చేసింది. సమంత పేరు మీదే మార్కెటింగ్ అయిన ఈ సినిమా.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
భీమునిపట్నం అనే కుగ్రామం. అక్కడ కేబుల్ టీవీ ఆపరేటర్ గా పనిచేస్తూ ఉంటాడు శ్రీను (హర్షిత్ రెడ్డి). తన స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ) తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు శ్రీను. అయితే వీరి భార్యలు అయినటువంటి శ్రీవల్లి, ఫరీదా, గాయత్రి (శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి)కి సీరియల్ పిచ్చి. ముఖ్యంగా జన్మజన్మల బంధం అనే సీరియల్ ను తెగ చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ టెలికాస్ట్ అయ్యే టైంలో ఎవరైనా వారిని డిస్టర్బ్ చేస్తే.. వాళ్ళ అంతు చూడనిదే ఊరుకోరు. అసలు వీళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సీరియల్ టెలికాస్ట్ అయ్యే టైంలోనే ఎందుకు అంత వైల్డ్ గా మారిపోతున్నారు? వాళ్లకి ఏమైంది? మధ్యలో మాయ మాత ( సమంత రూత్ ప్రభు) పాత్ర ఏంటి? ఆమె శ్రీను అండ్ ఫ్రెండ్స్ కి ఎలాంటి సాయం చేసింది? చివరికి ‘శుభం’ కార్డు కరెక్ట్ గా పడిందా? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
సమంత నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఇది. సో డౌట్ లేకుండా ఈ సినిమాకి యూ.ఎస్.పి ఆమెనే. సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా చేస్తున్నప్పుడు కథల విషయంలో సమంత ఎలా ఆలోచిస్తూ వచ్చిందో.. నిర్మాతగా మారినప్పుడు కూడా ఆమె అలాగే ఆలోచిస్తూ వస్తుంది అని చెప్పాలి. మొదటి సినిమా కోసం ఆమె ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. అదే విధంగా ఎంటర్టైనింగ్ గా ఉంది. హర్రర్ జోనర్ సినిమాలు అంటే రొటీన్ అనే ముద్ర పడిపోయింది. అయితే దానికి సరికొత్త డెఫినిషన్ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. అతను ఎంపిక చేసుకున్న పాయింట్.. అలాగే దాని చుట్టూ అల్లిన కామెడీ ట్రాక్స్ మెప్పించే విధంగా ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫన్నీగా అయిపోయింది. కాకపోతే సెకండాఫ్ లో కొన్ని సీన్లు రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఊహించినట్టే ఉన్నా.. ఫైనల్ గా టైటిల్ కి ఇచ్చిన జస్టిఫికేషన్ అభినందనీయం. కథలో నోవాలిటీ ఉంది. ఆకట్టుకునే హాస్యం కూడా ఉంది. కాకపోతే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అని చెప్పలేం. మెయిన్ పాయింట్ కి కనెక్ట్ అవ్వకపోతే.. చివరి వరకు ట్రావెల్ చేయడం కష్టం. అయితే టెక్నికల్ గా ఈ సినిమాని ఏమాత్రం తగ్గకుండా తీశారు సమంత అండ్ టీం. కథకి ఎంత అవసరమో ఏది అవసరమో ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు. మృదుల్ సేన్ సినిమాటోగ్రఫీ ఓకే. ధర్మేంద్ర కాకరాల ఇంకాస్త పోర్షన్ ను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే… హీరోలుగా చేసిన హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ నేచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. మనకి ఎక్కువగా తెలియని మొహాలు కావడంతో క్యారెక్టర్స్ తో ట్రావెల్ అయ్యే అవకాశం దక్కింది. శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి కూడా చూడటానికి చక్కగా ఉన్నారు. భయపెట్టే రేంజ్లో నవ్వించి తమ టాలెంట్ చూపించారు. వంశీధర్ గౌడ్ పాత్ర బాగుంది. సమంత పాత్ర.. సినిమాని మరింతగా పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పాలి.అంతకు మించి ఆమె పాత్రకి పెద్దగా మెరుపులు లేవు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
కాన్సెప్ట్
కామెడీ
రన్ టైం
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లో వచ్చే సాగదీత
రిపీటెడ్ సీక్వెన్సులు
మొత్తంగా.. ‘శుభం’ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే..ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చుతుంది. అలా అని పూర్తిగా థియేట్రికల్ మూవీ అని చెప్పలేం. ఇలాంటి సినిమాలు ఓటీటీకి కరెక్ట్ గా సెట్ అవుతాయి. కానీ సమంత కూడా సినిమాలో నటించడం ఓ పుషింగ్ పాయింట్ అని చెప్పాలి.
Subham Telugu Movie Rating : 2.25/5