BigTV English
Advertisement

Thangalaan OTT : డిజాస్టర్ మూవీ మాకొద్దు… విక్రమ్ మూవీపై బాంబ్ పేల్చిన నెట్‌ఫ్లిక్స్..

Thangalaan OTT : డిజాస్టర్ మూవీ మాకొద్దు… విక్రమ్ మూవీపై బాంబ్ పేల్చిన నెట్‌ఫ్లిక్స్..

Thangalaan OTT : భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కంటెంట్ బాగా వచ్చి, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే ఓటీటీకి సంబంధించి దిగులు ఉండదు. కానీ, ఒకవేళ సినిమా కంటెంట్ బాగాలేకపోతే, ఆడియన్స్ రిజక్ట్ చేస్తే, నిర్మాతలను సేవ్ చేసేది ఓటీటీ డీల్ మాత్రమే. అందుకే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు ఓటీటీ డీల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఇటీవల చియాన్ విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ తంగలాన్ నిర్మాతలు ఓటీటీ డీల్ విషయంలో ఓ చిన్న మిస్టేక్ చేశారు. దీని వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఏంటి…? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్ధాం…


పా. రంజిత్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు వస్తున్నాయంటే, తప్పకుండా చూడాల్సిందే అని వేచి చూసే వాళ్ల సంఖ్య ఒక తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఉన్నారు. ఇటీవల వచ్చిన తంగలాన్ మూవీపైన కూడా అలాంటి అంచనాలే ఉండేవి. పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది ఈ మూవీ. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో కె. ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. కానీ, ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద వచ్చిన వసూళ్లు కేవలం 100 కోట్ల లోపే.

నిర్మాతలు చేసిన మిస్టేక్ ఇదే…


అయితే నిర్మాతలకు కాస్తో కూస్తో హెల్ప్ అయ్యేది ఓటీటీ డీల్. అన్ని సినిమాల్లానే ఈ మూవీ ఓటీటీ డీల్‌ను రిలీజ్‌కు ముందే క్లోజ్ చేసుకున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 35 కోట్లకు తంగలాన్ మూవీ ఓటీటీ రైట్స్ తీసుకుందని తెలుస్తుంది. అయితే, ఈ డీల్ టైంలో నిర్మాతలు ఓ మిస్టేక్ చేశారు. అదేంటంటే… ఒప్పందం టైంలో మూవీ రిలీజ్ అయ్యాకా… వచ్చిన టాక్‌ను ప్రకారం… ముందుగా అనుకున్న ప్రైజ్‌లో మార్పులు చేసుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ ప్రతిపాదించిందట. దీనికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

శాపంగా మారిన ఒప్పదం…

ఇప్పుడు అదే తంగలాన్ నిర్మాతల పాలిట శాపంగా మారింది. మూవీ టాక్ బాలేదని, అందుకు కలెక్షన్లు సరిగ్గా రాలేదని నెట్ ఫ్లిక్స్ చెబుతుందట. దీంతో ముందుగా అనుకున్న ప్రైజ్ ను దాదాపు సగం మేర తగ్గించాలని అడుగుతున్నారాట. ఇప్పటికే నష్టాలను చూసిన నిర్మాత దీనికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సిన తంగలాన్ మూవీ ఇంకా రావడం లేదని సమాచారం.

నెట్‌ప్లిక్స్‌తో డీల్ రద్దు…?

ప్రైజ్ తగ్గించాలని నెట్‌ఫ్లిక్స్ పట్టుపట్టడంతో, నిర్మాతలు మరో ఓటీటీవైపు చూస్తున్నారట. ముందుగా నెట్‌ఫ్లిక్స్ తో చేసుకున్న ప్రైజ్‌కే మరో ఓటీటీ ప్లాట్ ఫాంకు విక్రయించాలని మేకర్స్ చూస్తున్నారట. అయితే, దీనిపై మేకర్స్ నుంచి గానీ, నెట్ ఫ్లిక్స్ గురించి కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మేకర్స్ నమ్మకమిదే…

తంగలాన్ మూవీ కమర్షియల్ గా రాణించలేకపోవచ్చు. కానీ, సినిమాకు పాజిటివ్ టాక్ బాగానే వచ్చింది. అయితే ఈ టాక్ ఆడియన్స్ ను థియేటర్ వరకు రప్పించలేకపోవచ్చు. కానీ, ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ భారీగానే ఉంటుంది. నిజానికి ఇలాంటి మూవీలకు ఓటీటీల్లోనే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు తంగలాన్ మేకర్స్ కి కూడా అదే నమ్మకం ఉంది.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×