BigTV English

OTT Movie : ఇక్కడ ప్రతీ రాత్రి ఓ యుద్ధమే… పొరపాటున పడుకున్నారో దబిడి దిబిడే

OTT Movie : ఇక్కడ ప్రతీ రాత్రి ఓ యుద్ధమే…  పొరపాటున పడుకున్నారో దబిడి దిబిడే

OTT Movie : ఒక ద్వీపంలో, రాత్రిపూట సముద్రం నుండి వచ్చే వింత జీవుల దాడుల మధ్య ఇద్దరు పురుషులు చిక్కుకుంటారు. ఒక ఇంగ్లీష్ వాతావరణ శాస్త్రవేత్త, తన గతంలోని బాధల నుండి ఉపశమనం పొందడానికి ఈ నిర్జన ద్వీపానికి వస్తాడు. కానీ అతను ఊహించని ప్రమాదంలో చిక్కుకుంటాడు. అక్కడ పనిచేసే లైట్‌హౌస్ కీపర్ ఒక క్రూరమైన వ్యక్తి, ఒక వింత సముద్రపు జీవిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇక రాత్రయితే చాలు ఆ జీవులు వీళ్ళ పై దాడి చేస్తుంటాయి. ఇంతకీ ఆ జీవులు ఎందుకు దాడి చేస్తాయి ? అక్కడి నుంచి వీళ్ళు బయటపడతారా ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ మొదటి ప్రపంచ యుద్ధం (1914) ఆరంభంలో జరుగుతుంది. ‘ఫ్రెండ్’ అని పిలవబడే ఒక ఇంగ్లీష్ వ్యక్తి దక్షిణ అట్లాంటిక్‌లో ఆంటార్కిటిక్ సర్కిల్ సమీపంలో ఉన్న ఒక నిర్జన ద్వీపంలో కి వస్తాడు. ఒక సంవత్సరం పాటు వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేయడానికి అక్కడికి చేరుకుంటాడు. అతను భర్తీ చేయాల్సిన మునుపటి వాతావరణ శాస్త్రవేత్త జాడ తెలీకుండా పోతుంది. ద్వీపంలో ఒకే ఒక గ్రూనర్ అనే వ్యక్తి మాత్రమే నివశిస్తుంటాడు. ఒక క్రూరమైన మనస్తత్వం కలిగి, అక్కడే లైట్‌హౌస్ కీపర్ గా పని చేస్తుంటాడు. మునుపటి వ్యక్తి టైఫస్‌తో మరణించాడని చెబుతాడు. కాని అతని శరీరం జాడ కూడా లేదని తెలియజేస్తాడు.


ఫ్రెండ్ ఈ ద్వీపాన్ని పరిశీలిస్తూ, మునుపటి వాతావరణ శాస్త్రవేత్త డైరీని కనుగొంటాడు. అందులో వింత సముద్ర జీవుల గీతా చిత్రాలు ఉంటాయి. ఆ రాత్రి, అతని క్యాబిన్‌పై మానవ రూపంలో ఉండే సముద్రపు జీవులు దాడి చేయడానికి వస్తాయి. గ్రూనర్ వీటిని “టోడ్స్” అని పిలుస్తాడ. ఫ్రెండ్ వాటిని తప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాత్రి దాడులను తట్టుకోలేక, అతని క్యాబిన్ కాలిపోతుంది. అతను గ్రూనర్ ఉండే లైట్‌హౌస్‌లో ఆశ్రయం పొందుతాడు. అక్కడ గ్రూనర్ ఒక అనేరిస్‌ అనే మహిళా సముద్రపు జీవితో సన్నిహితంగా ఉండటం చూస్తాడు. గ్రూనర్ ఆమెను బానిసలా, ఆమెపై క్రూరంగా ప్రవర్తిస్తాడు.

మరో వైపు ఫ్రెండ్, గ్రూనర్ రాత్రిపూట ఈ జీవుల దాడులను ఎదుర్కొంటూ, లైట్‌హౌస్‌లో కలిసి జీవించవలసి వస్తుంది. ఫ్రెండ్, అనేరిస్‌తో సానుభూతి పెంచుకుంటాడు. ఆమె మనిషిలా ఎమోషన్స్ చూపిస్తుందని గమనిస్తాడు. గ్రూనర్ ఈ జీవులను ద్వేషిస్తాడు. వాటిని పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటాడు. చివరికి ఆ జీవులను గ్రూనర్ అంతం చేస్తాడా ? ఫ్రెండ్ ఆ జీవులకు సహాయం చేస్తాడా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, తెలుసుకోవ అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఓటిటిలో దుమ్మురేపుతున్న తెలుగు హీరో మూవీ… దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా పేరు ‘కోల్డ్ స్కిన్’ (Cold Skin). 2017 లో వచ్చిన ఈ సినిమాకి జావియర్ జెన్స్ దర్శకత్వం వహించారు. ఇందులో డేవిడ్ ఓక్స్ (ఫ్రెండ్), రే స్టీవెన్సన్ (గ్రూనర్), ఆరా గరిడో (అనేరిస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 48 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDb లో 6.0/10 రేటింగ్ ఉంది.జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×