OTT Movie : విశాఖపట్నంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. అన్నీ ఒకే ప్యాటర్న్‌ను అనుసరిస్తున్నాయి. ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ అరవింద్ ఈ కేసును సాల్వ్ చేయడానికి వస్తాడు. అతని ట్రాక్ రికార్డ్ అద్భుతంగాఉంటుంది. కానీ ఈ కేసు అతని కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకుంటుంది. క్లూస్‌లు అరవింద్‌ను ఒక షాకింగ్ ట్రూత్ వైపు నడిపిస్తాయి. హంతకుడు ఎవరు? అతని మోటివ్ ఏమిటి? అరవింద్ ఈ కిల్లర్‌ను పట్టుకుంటాడా ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
విశాఖపట్నంలో వరుస హత్యలు జరుగుతాయి. ఒక్కో హత్యలో ఒకే రకమైన ప్యాటర్న్ లో జరుగుతుంటాయి. ACP అరవింద్ (నవీన్ చంద్ర), ఒక స్టోయిక్, స్మార్ట్ పోలీస్ ఆఫీసర్. ఈ సీరియల్ కిల్లింగ్ కేసును తీసుకుంటాడు. ఎందుకంటే మునుపటి ఆఫీసర్ రంజిత్ (శశాంక్) యాక్సిడెంట్‌లో గాయపడతాడు. అరవింద్ తన అసిస్టెంట్ మనోహర్ (దిలీపన్) సహాయంతో క్లూస్‌లను కలెక్ట్ చేస్తాడు. ఒక విక్టిమ్ బాడీ నుండి కీలకమైన లీడ్ దొరుకుతుంది. అది అతన్ని “ట్విన్ బర్డ్” అనే స్కూల్‌కు నడిపిస్తుంది. ఇక్కడ కేవలం ట్విన్స్ మాత్రమే చదువుతుంటారు. హత్యలు ట్విన్స్‌ను టార్గెట్ చేస్తున్నాయని, బెంజమిన్ అని పిలవబడే కిల్లర్ సర్వైవింగ్ ట్విన్స్‌ను చంపుతున్నాడాని అరవింద్ కనిపెడతాడు.
ఈ కేసు అరవింద్‌ను రివెంజ్ చైల్డ్‌హుడ్ ట్రామా డార్క్ పాత్‌లోకి తీసుకెళ్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో స్లో పేసింగ్, ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్‌లో లేయర్డ్ ట్విస్ట్‌లు, ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్‌లు ఉంటాయి. ఇవి కిల్లర్ మోటివ్‌ను హ్యూమనైజ్ చేస్తాయి. సినిమా క్లైమాక్స్‌లో ఒక మైండ్-బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది. ఇది కిల్లర్ ఐడెంటిటీ రివీల్ చేస్తుంది. చివరికి కిల్లర్ బెంజమిన్ ఎవరు? అతని మోటివ్ ఏమిటి? ట్విన్ బర్డ్ స్కూల్ హత్యలతో ఎలా లింక్ అయింది? అరవింద్‌కు కిల్లర్‌తో ఉన్న కనెక్షన్ ఏమిటి? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : తల్లిని ఇంటరాగేషన్ చేసే కొడుకులు … ముసుగు వెనుక గందరగోళం .. ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు Eleven. 2025 మే 16న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు. ఇందులో నవీన్ చంద్ర, రేయా హరి,అభిరామి, దిలీపన్, శశాంక్, రిత్విక పన్నీర్సెల్వం, ఆడుకలం నరేన్, రవి వర్మ, కిరీటి దామరాజు వంటి నటులు నటించారు. 2 గంటల 16 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.5/10 రేటింగ్ ఉంది. 2025 జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా aha లలో ఈసినిమా అందుబాటులకి వచ్చింది. అయితే ప్రైమ్ వీడియోలో దేశంలోనే నెంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది ఈ సినిమా. ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.