E-Paper
Advertisement

Comedy Action Movie OTT : 13 ఏళ్ల నాటి సినిమా సడన్ గా ట్రెండింగ్ లోకి… ఇదెక్కడి మెంటల్ మాస్ ట్విస్ట్ మావా

Comedy Action Movie OTT : 13 ఏళ్ల నాటి సినిమా సడన్ గా ట్రెండింగ్ లోకి… ఇదెక్కడి మెంటల్ మాస్ ట్విస్ట్ మావా
Advertisement

Comedy Action Movie OTT : ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సినిమాలకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా మారింది. యాక్షన్ థ్రిల్లర్‌ల నుండి హర్రర్ సినిమాల వరకు, ప్రతివారం ఓ కొత్త కంటెంట్ తో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక మూవీ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. అదికూడా 13 ఏళ్ల నాటి సినిమా అకస్మాత్తుగా, ఇప్పుడు ట్రెండ్ ఆవుతోంది. ఈ సినిమా అప్పట్లో వెండితెరపై కూడా బాగా మెరిసింది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ కూడా నవ్వులు పూయిస్తాయి. కమర్షియల్ గా బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఏ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ పేరు “చెన్నై ఎక్స్‌ప్రెస్”(Chennai express). రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013లో థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద ₹227 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ సినిమా ఈ మార్కును అధిగమించడం ఇదే మొదటిసారి. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా IMDbలో 6.2 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇటీవల రాణి ముఖర్జీ నటించిన “మర్దానీ” మూవీ కూడా ట్రెండింగ్ లో నడిచింది. ఇప్పుడు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన బ్లాక్‌బస్టర్ “చెన్నై ఎక్స్‌ప్రెస్” కూడా ఇదే బాటలో ట్రెండ్ అవుతోంది.

ఆ సినిమా కథ ఏమిటి?

Advertisement

ఈ కథ రాహుల్ (షారుఖ్ ఖాన్), మీనా (దీపికా పదుకొనే) చుట్టూ తిరుగుతుంది, నికితిన్ ధీర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రాహుల్ తన తాత చితాభస్మాన్ని రామేశ్వరంలో నిమజ్జనం చేయడానికి బయలుదేరుతాడు. ఇంతలో అతను ఒక నవ వధువు (మీనా) పారిపోయి రైలు ఎక్కడాన్ని చూస్తాడు. ప్రమాదంలో ఉందని తెలుసుకుని, అతను ఆమెకు సహాయం చేస్తాడు. అప్పుడు అతను మీనా గురించి కూడా తెలుసుకుంటాడు. ఆమె తండ్రి ఒక పెద్ద డాన్. ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి రావడంతో ఆమె ఇంటి నుంచి వచ్చేసి ఉంటుంది. అయితే వీళ్ళు మళ్లీ ఆ గ్రామంలోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరుడుగుతుంది ? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది ? మీనా తండ్రి నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాల చుట్టూ మిగతా కథ ఉంటుంది.

Read Also : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అదుర్స్… కానీ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోని సన్నీ లియోన్ మూవీ… ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్

Tags

Related News

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

Big Stories

Advertisement
×