BigTV English

OTT Movie : స్టార్ హోటల్ కి, స్ట్రీట్ ఫుడ్ కి జరిగే వంటల పోటీల్లో గెలిచేది ఎవరు?… మనసు మెచ్చే మంచి మూవీ భయ్యా

OTT Movie : స్టార్ హోటల్ కి, స్ట్రీట్ ఫుడ్ కి జరిగే వంటల పోటీల్లో గెలిచేది ఎవరు?… మనసు మెచ్చే మంచి మూవీ భయ్యా

OTT Movie : సినిమాలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు. అయితే వాటిలో కొన్ని సినిమాలు మనుషుల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. అటువంటి సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక వంటలు చేసే చెఫ్ చుట్టూ తిరుగుతుంది. మూవీ చూస్తున్నంత సేపు, మరో ఆలోచన లేకుండా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఈ చైనీస్ మూవీ పేరు ‘కుక్ అప్ ఎ స్టార్మ్’ (Cook up a Storm). 2017 లో వచ్చిన ఈ హాంగ్ కాంగ్ పాక డ్రామా మూవీకి రేమండ్ యిప్ దర్శకత్వం వహించారు. ఇందులో నికోలస్ త్సే, జంగ్ యోంగ్-హ్వా, జి యు, టిఫనీ టాంగ్, మిచెల్ బాయి, ఆంథోనీ వాంగ్ నటించారు. ఇది 10 ఫిబ్రవరి 2017న చైనాలో విడుదలైంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

హీరో ఒక సెవెన్ స్టార్ హోటల్లో చెఫ్ గా పని చేస్తుంటాడు. అతడు చేసే వంటలకి అక్కడ ప్రజలు ఫిదా అవుతూ ఉంటారు. అక్కడి ప్రజలు ఆ హోటల్లోనే ఎక్కువగా ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. మరోవైపు పాల్ అనే వ్యక్తి ఫ్రాన్స్ లో ఒక రాజ కుటుంబం దగ్గర వంటలు చేసి మంచి పేరు సంపాదిస్తాడు. అయితే హీరో ట్రెడిషనల్ ఫుడ్ ని ఎక్కువగా చేస్తూ ఉంటాడు. పాల్ మాత్రం టెక్నికల్ గా వంటలు చేసి అందరిని మెప్పిస్తుంటాడు.  అయితే హీరో హాంగ్కాంగ్లో రెస్టారెంట్ ని రన్ చేస్తుంటాడు. పాల్ కి రాజ కుటుంబం మంచి ఆఫర్ ఇచ్చినా కూడా అక్కడ చేయకుండా, డైరెక్టర్ గానే తన స్వస్థలం హాంగ్ కాంగ్ రెస్టారెంట్ ని నడపాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఒక చేపల మార్కెట్లో హీరోకి, పాల్ కి మధ్య చేపలు కొనే విషయంలో చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడు తెలుసుకున్న విషయం ఏమిటంటే హీరో నడిపే హోటల్ ముందరే పాల్ కూడా ఒక త్రీ స్టార్ హోటల్ ని రన్ చేయడానికి వచ్చాడని.

వీళ్ళిద్దరి మధ్య వంటల పోటీలు ఎవరు బాగా చేస్తారనే కాంపిటీషన్ కూడా జరుగుతుంది. మొదట ఆ కాంపిటీషన్ గల్లీలో జరుగుతుంది. ఇద్దరూ విషయం ఉన్న వంటవాళ్ళు కావడంతో, వీళ్ళిద్దరి ప్రతిభ చూసి మీ కాంపిటీషన్ నేషనల్ లెవెల్ లో జరగాలని అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు. ఆ తరువాత వీళ్ళు ఒక ఫేమస్ ప్రోగ్రాంలో వంటలు చేయడానికి వెళతారు. చివరికి వంటల కాంపిటీషన్లో హీరో గెలుస్తాడా? పాల్ తనదైన స్టైల్ లో వంటలు చేసి మెప్పిస్తాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్  స్ట్రీమింగ్ అవుతున్న ‘కుక్ అప్ ఎ స్టార్మ్’ (Cook up a Storm) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×