Caste Census Survey: కులగణన వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ సర్వే ప్రారంభం కానుంది. రేపటి నుంచి మరోసారి కులగణన చేపట్టనుంది. కులగణన సర్వేలో పాల్గొనని 3,56,323 కుటుంబాలకు మరో అవకాశం ఇస్తోంది. ఇవాల్టి నుంచి ఈనెల 28 వరకు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. ఫోన్ చేసిన వారి ఇళ్లకి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయనున్నారు.
ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది. ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్‌తో పాటుగా పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ ను తెలియజేయాల్సి ఉంటుంది. కాల్ చేసిన వాళ్ళు ఇచ్చే అడ్రస్ ప్రకారం వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు కులగణన చేయనున్నారు.
గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 50 రోజుల పాటు నిర్వహించిన సర్వేలో కొన్ని కుటుంబాల నుంచి వివరాలకు అందకపోవడంతో మరో 13 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాంటి లెప్ట్ ఓవర్ కుటుంబాల కోసమే రెండోసారి కులగణన సర్వే(Caste Census Survey నిర్వహిస్తున్నామని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే జరిగిన సర్వే ప్రకారం ఇంకా వివరాలు ఇవ్వని మొత్తం జనభాలో 3.1 శాతం అంటే మూడు లక్షల యాబై ఒక్క వేల కుటుంబాలు.. తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంది.
మొదటి దశ సర్వే టైంలో కొన్ని కుటుంబాలు ఊర్లకు వెళ్లిపోవడంతో ఇండ్ల తాళాలు వేసి ఉన్నాయని, మరికొన్ని కుటుంబాలు కావాలనే వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సర్వేకు సహకరించకుండా వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన వారికి ప్రభుత్వ సర్వేను ప్రశ్నించు అవకాశామే లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు.
Also Read: నేనే దేవుడన్నాడు.. కటకటాల పాలయ్యాడు.. వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు
రెండోసారి సర్వేకోసం మూడంచెల విధానాన్ని ఎంపిక చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. దానికి ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకోనున్నారు. లేదా సంబంధిత మండల కేంద్రాల్లో ఎంపీడీవో ఆఫీసులోని ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తులు ఇచ్చే చాన్స్ ఉంది. ఇందుకోసం ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోని వివరాలు నమోదు చేసి, సంతం చేసిన తర్వాత అధికారులకు సమర్పించాలని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఇక మూడో విధానంలో నేరుగా ప్రజా పాలన కేంద్రానికి వెళ్లి అక్కడే దరఖాస్తు నింపి ఇవ్వొచ్చు.