OTT Movie : నవాజుద్దీన్ సిద్దిఖీ రీసెంట్ గా నటించిన ఒక మూవీ ఓటీటీలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం 1990లలో గోవాలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కోస్టావో ఫెర్నాండెస్ అనే కస్టమ్స్ అధికారి జీవితం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అతను ఒక పెద్ద బంగారు స్మగ్లింగ్ రాకెట్‌ను ధ్వంసం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ZEE5 లో స్ట్రీమింగ్
2025లో విడుదలైన ఈ బయోగ్రాఫికల్ క్రైమ్ మూవీ పేరు “కోస్టావో” (Costao). దీనికి సేజల్ షా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, ప్రియా బాపట్, కిషోర్ కుమార్ జి., హుస్సేన్ దలాల్, మహికా శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. భవేష్ మండలియా, మేఘనా శ్రీవాస్తవ రాసిన స్క్రీన్‌ప్లేతో, ఈ చిత్రం 2025 మే 1 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రం 124 నిమిషాల నిడివి కలిగి ఉంది. IMDbలో 6.4/10 రేటింగ్‌ను పొందింది.
స్టోరీలోకి వెలికితే
1991లో గోవాలో ఈ స్టోరీ మొదలవుతుంది. కోస్టావో ఫెర్నాండెస్ (నవాజుద్దీన్ సిద్దిఖీ) అనే ఒక కస్టమ్స్ అధికారి, తన భార్య మరియా (ప్రియా బాపట్), కొడుకు క్రిస్ (అబీర్ జైన్), కూతురు మరిస్సా (అస్మి దియో)తో సంతోషంగా జీవిస్తుంటాడు. కోస్టావో ఒక కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్. అంతేకాకుండా ఒక మాజీ అథ్లెట్. అతను 1500 కిలోల బంగారు స్మగ్లింగ్ ఆపరేషన్ గురించి సమాచారం అందుకుంటాడు. దీనిని స్థానిక రాజకీయవేత్త, స్మగ్లర్ డి’మెల్లో (కిషోర్ కుమార్ జి.) నడిపిస్తుంటారు. రాజకీయ నాయకుడి సోదరుడు అల్వర్నాజ్ అలెమావో కూడా ఈ రాకెట్‌లో భాగంగా ఉంటాడు. కోస్టావో గోవా తీరంలోని బీచ్‌లను గమనిస్తూ స్మగ్లింగ్ ఆపరేషన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఒక రోజు ఒక ఇన్‌ఫార్మర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా, బంగారం ఒడ్డున దిగుతున్న బీచ్ గురించి తెలుసుకుంటాడు. కోస్టావో ఆ స్థలానికి చేరుకుంటాడు. డి’మెల్లో సోదరుడు పీటర్ (హుస్సేన్ దలాల్) ఈ బంగారాన్ని కారులో రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తాడు. పీటర్‌ను వెంబడిస్తూ, కోస్టావో అతన్ని ఆపమని ఆదేశిస్తాడు. కానీ ఆత్మరక్షణలో భాగంగా పీటర్‌ను అనుకోకుండా కోస్టావో చంపేస్తాడు. ఈ సంఘటన కోస్టావో జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది.పీటర్ మరణం తర్వాత, కోస్టావో ఒక రాత్రి జంగిల్‌లో దాక్కుని, గాయాలతో బాధపడుతూ బతికి ఉండటానికి పోరాడతాడు. మరుసటి రోజు అతను పోలీసులకు లొంగిపోతాడు. కానీ ఇక్కడ నుండి అతని నిజమైన పోరాటం ప్రారంభమవుతుంది.
డి’మెల్లో రాజకీయ ప్రభావం కారణంగా, కోస్టావో హత్య కేసులో ఫస్ట్-డిగ్రీ మర్డర్ ఆరోపణలను ఎదుర్కొంటాడు. CBI అతన్ని రోజూ అవమానిస్తుంది. ఈ స్మగ్లింగ్ కేసు మరుగున పడిపోతుంది. అతని కుటుంబం, ముఖ్యంగా మరియా, ఈ ఒత్తిడి కారణంగా విడిపోతుంది. కోస్టావో తన స్వంత లాయర్‌ను నియమించుకోవలసి వస్తుంది. డి’మెల్లో గుండాలు కోస్టావోను హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక సన్నివేశంలో డాక్టర్లుగా మారువేషంలో దాడి కూడా చేస్తారు. కోస్టావో దాదాపు ఒక దశాబ్దం పాటు కోర్టు ట్రయల్స్‌లో పోరాడతాడు. అతని నిజాయితీ ప్రశ్నార్థకమవుతుంది. అతని కుటుంబ జీవితం ఛిన్నాభిన్నమవుతుంది. కోస్టావో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాడు ? తన కుటుంబంతో మాళ్ళీ సంతోషంగా జీవిస్తాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాలాల్సిందే.
Read Also : 11 మంది అబ్బాయిలతో పార్టీ… ఒళ్ళు తెలీని టైంలో బలవంతం చేసే ఒక్కడు… అల్టిమేట్ ట్విస్టులున్న మలయాళ మూవీ