WCL 2025 Bowl-Out: వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో జరిగిన ఓ బాల్ అవుట్ మ్యాచ్ అందరిలోనూ ఆసక్తిని నింపింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా శనివారం వెస్టిండీస్ ఛాంపియన్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ మధ్య రెండవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో.. రెండు జట్లు సమానంగా పరుగులు చేశాయి. అంటే టై అయింది. ఈ తరుణంలో సూపర్ ఓవర్ నిర్వహించాల్సింది పోయి బాల్ అవుట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ 2 పాయింట్లు సాధించి గ్రాండ్ విక్టరీ కొట్టింది. అప్పట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా కూడా బాల్ అవుట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పైన టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్లో… సౌత్ ఆఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టి… చరిత్ర సృష్టించింది.
వర్షం కారణంగా మ్యాచ్ డ్రా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్నటి రోజున వెస్టిండీస్ ఛాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా ఛాంపియన్స్ మధ్య రెండవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఎడ్జ్ బస్టన్ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. అయితే… ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు 11 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 79 పరుగులు చేసింది. వర్షం కారణంగా 11 ఓవర్లకే మ్యాచ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ జట్టులో.. ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. గేల్ రెండు పరుగులకు అవుట్ గా స్మిత్ ఏడు పరుగులు చేశాడు. సిమన్స్ ఒక్కడే 28 పరుగులు చేయగా వాల్టన్ 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 79 పరుగులు చేసినప్పటికీ.. వర్షం అడ్డంకిగా మారడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సౌత్ ఆఫ్రికా టార్గెట్ ను 81 పరుగులకు ఫిక్స్ చేశారు. దీంతో 81 పరుగులు ఛేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా 80 పరుగులు చేసి మ్యాచ్ డ్రా చేసింది. మ్యాచ్ డ్రా కాగానే సూపర్ ఓవర్ ఆడతారు. కానీ వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంటులో.. సూపర్ ఓవర్ ఆడకుండా బాల్ అవుట్ నిర్వహించారు.
బాల్ అవుట్ లో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా
మ్యాచ్ డ్రా కావడంతో వెస్టిండీస్ ఛాంపియన్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ మధ్య బాల్ అవుట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే… రెండు పాయింట్లు సాధించిన సౌత్ ఆఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2007 t20 ప్రపంచ సమయంలో… అచ్చం ఇలాగే టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బాల్ అవుట్ మ్యాచ్ నిర్వహించారు. రెండు జట్ల మధ్య స్కోర్ లెవెల్ కావడంతో ఆ పరిస్థితి నెలకొంది. అప్పుడు మూడు పాయింట్లు సాధించిన టీమిండియా విజయం సాధించింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అలాగే మ్యాచ్ నిర్వహించారు.
NOSTALGIA FOR FANS – A BOWL OUT IN CRICKET AFTER A LONG TIME. 🥹❤️pic.twitter.com/4LGiYv6inf
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2025
?igsh=YTgxaDNzYWswaTl4
The match ended in a tie, but South Africa Champions clinched the bowl-out to bag 2 points against the West Indies Champions! 🔥🇿🇦#WCL2025 #ABD #Cricket #Sportskeeda pic.twitter.com/YY4yQODW69
— Sportskeeda (@Sportskeeda) July 19, 2025