OTT Movie : కొన్ని స్టోరీలు చాలా వరకు ఊహకు అందని విధంగానే ఉంటాయి. ప్రపంచమంతా మగవాళ్ళు చనిపోతే, ఆడవాళ్లు మాత్రమే భూమి మీద ఉంటే ఎలా ఉంటుందో ఒక వెబ్ సిరీస్ ని తీశారు. ఈ వెబ్ సిరీస్ ను న్యూజిలాండ్ మేకర్స్ తే రకెక్కించారు. ఈ సిరీస్లో చాలా ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి. ఆడవాళ్లే రాజ్యాన్ని ఏలుతూ ఉంటారు. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బ్లాక్ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘క్రీమెరీ’ (Creamerie). 2021 లో న్యూజిలాండ్ నుండి వచ్చిన ఈ సిరీస్‌ను రోజాన్ లియాంగ్, జెజె ఫాంగ్, పెర్లినా లా, ఆలీ జూ సృష్టించారు. ఇందులో ఒక మహమ్మారి వైరస్ కారణంగా, భూమి మీద అందరు పురుషులు చనిపోతారు. ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే మిగులుతారు. రెండు సీజన్ లతో ఈ సిరీస్ చివరివరకూ సరదాగా సాగిపోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) హులు (Hulu) లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ భవిష్యత్తులో జరుగుతుంది. ఒక ప్లేగ్ వైరస్ కారణంగా భూమిపై 99% పురుషులు కొన్ని వారాల్లోనే చనిపోతారు. మిగిలిన 1% పురుషులను న్యూజీలాండ్‌లోని ‘ది ఫెసిలిటీ’ అనే ప్రదేశానికి పంపిస్తారు. అయితే వారు కూడా బతకలేరని అందరూ భావిస్తారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత, మహిళలు కొత్త సమాజాన్ని నిర్మించుకుంటారు. ఇది ‘వెల్‌నెస్’ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది. వెల్‌నెస్ సంస్థ జనాభా పెరుగుదలను నియంత్రిస్తుంది. స్పెర్మ్ బ్యాంకుల నుండి సేకరించిన స్పెర్మ్‌ను లాటరీ ద్వారా మహిళలకు పంపిణీ చేస్తుంది. ఇందులో ముగ్గురు స్నేహితులు – అలెక్స్ , జైమీ, మరియు పిప్ న్యూజీలాండ్‌లోని హిరో వ్యాలీలో ఒక డైరీ ఫామ్‌ను నడుపుతుంటారు. ఒక రోజు, వారు యాదృచ్ఛికంగా ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టి, అతను బతికే ఉన్న చివరి పురుషుడని తెలుసుకుంటారు. ఇది వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. బాబీ వెల్‌నెస్ సంస్థ రహస్యంగా కొంతమంది పురుషులను బందీలుగా ఉంచి, వారి నుండి స్పెర్మ్ సేకరిస్తోందని అతను వాళ్ళకు వెల్లడిస్తాడు. అక్కడి నుంచి స్టోరీ టర్న్ తీసుకుంటుంది.
సీజన్ 1:
మొదటి సీజన్‌లో, ఈ ముగ్గురు స్నేహితులు బాబీని రక్షించడానికి ప్రయత్నిస్తారు, అదే సమయంలో వెల్‌నెస్ నాయకురాలు లేన్ నేతృత్వంలోని ఈ సంస్థ చీకటి రహస్యాలను బయటపెడతారు. సీజన్ చివరిలో, వారు ఒక రహస్య ప్రయోగశాలను కనిపెడతారు. అక్కడ కొంతమంది బతికే ఉన్న పురుషులను కుర్చీలకు కట్టివేసి, వారి నుండి స్పెర్మ్ సేకరిస్తున్న దృశ్యం బయటపడుతుంది.
సీజన్ 2:
రెండవ సీజన్‌లో, అలెక్స్, జైమీ, పిప్, బాబీ హిరో వ్యాలీ నుండి పారిపోయి, లేన్‌ను న్యాయం ముందు నిలబెట్టడానికి ఒక రోడ్ ట్రిప్‌లో పాల్గొంటారు. వారు మానవజాతిని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఈ సిరీస్ ప్రత్యేకమైన కథ, కామిడీ, నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.