OTT Movie : ఇప్పుడు సినిమాలకు ధీటుగా, వెబ్ సిరీస్ లు పోటీ పడుతున్నాయి. థియేటర్లతో సంబంధం లేకుండా, నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి ఈ వెబ్ సిరీస్ లు. సెన్సార్ నిబంధనలు కూడా అంతగా లేకపోవడంతో, ఈ సిరీస్ లలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఒక రేంజ్ లో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ హారర్ జానర్లో వచ్చింది. ఈ సిరీస్ చివరివరకూ క్రేజీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
జోడీ, బ్రాండన్ అనే ఇద్దరు యువకులు తమ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అల్లరి పనులు చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తుంటారు. ఒక రోజు, బాజ్ వారెన్ అనే వ్యక్తి నుండి జోడీకి ఒక మాయాజాలం ఉన్న బాక్స్ లభిస్తుంది. ఈ బాక్స్ కు సమయాన్ని ఆపగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ బాక్స్‌తో జోడీ, బ్రాండన్ సమయాన్ని ఆపి, తమ చుట్టూ ఉన్నవారితో చిలిపి పనులు చేస్తుంటారు. దొంగతనాలు, ప్రాంక్‌లు వంటివి కూడా చేస్తారు. కానీ ఈ బాక్స్‌కు అసలు యజమాని వేరే వ్యక్తి ఉంటాడు. ‘ది ట్రావెలర్’ అనే నీలి రంగు చర్మం కలిగిన విచిత్రమైన వ్యక్తి, దీనికి యజమానిగా ఉంటాడు. అతను దొంగలను, తప్పు చేసేవారిని శిక్షించడానికి సమయాన్ని ఆపి, వారి యవ్వనాన్ని తీసివేసి వృద్ధాప్యంలోకి మారుస్తుంటాడు.
ఇందులో భాగంగానే బాజ్ వారెన్ అనే యువకుడిని ట్రావెలర్ తాకడం వల్ల అతను వృద్ధుడిగా మారిపోతాడు. జోడీ, బ్రాండన్ ఈ బాక్స్‌ను ఉపయోగించి సరదాగా గడుపుతున్నప్పుడు, ట్రావెలర్ వారిని వెంబడిస్తాడు. అయితే జోడీ గతం తెలుసుకుని, ట్రావెలర్ ఆమెను క్షమిస్తాడు. కానీ ఆమెకు ఒక హెచ్చరికగా ఆమె చేతిని మాత్రం వృద్ధాప్యంలోకి మారుస్తాడు. బ్రాండన్‌కు కూడా జుట్టును మాత్రమే తెల్లగా మారుస్తాడు. చివరికి ఆ వింత మనిషి విధించిన శిక్షతో వాళ్ళకు బుద్ధి వస్తుందా ? జోడీ గతం ఏమిటి ? ఆ శిక్షకి ఏమైనా విరుగుడు ఉంటుందా ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హర్రర్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘క్రీప్డ్ అవుట్’ (Creeped Out). దీనిని రాబర్ట్ బట్లర్ సృష్టించారు. ఇది చిన్న పిల్లలు, యువకులను బాగా ఆకట్టుకుంది. ఈ స్టోరీ ఇద్దరు టీనేజర్స్ చుట్టూ తిరుగుతుంది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2017 అక్టోబర్ 31న CBBC ఛానెల్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.