Nani : టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రీసెంట్గా హిట్ 3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ యాక్షన్స్ అన్నివేశాలతో ఉన్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. మే 1న రిలీజ్ అయిన ఏ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈమధ్య నాని చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటుగా అటు బాక్స్ ఆఫీస్ నుంచి షేక్ చేసేలా కలెక్షన్స్ కూడా వసూలు చేస్తున్నాయి. అయితే నాని గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. అదేంటంటే నాని త్వరలోనే పేరు మార్చుకోబోతున్నాడు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. అసలు నిజం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పేరు మార్చుకోబోతున్న నాని..
హీరో నాని గురించి అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా హీరోగా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. తన టాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజెను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. అయితే నాని అసలు పేరు చాలామందికి తెలియదు. ఈయన పేరు నవీన్ బాబు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నారు. అలా ఇప్పుడు నాని అనే పేరుతో అందరూ పిలుస్తున్నారు. జాతకాలను ఎక్కువగా నమ్మే నాని తన స్క్రీన్ నేమ్ ని మరోసారి మార్చాలి అనే ఆలోచనలో ఉన్నాడట నాని. ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఇచ్చిన సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడట. అయితే నాని ఇప్పుడు ఏ పేరు పెట్టుకుంటాడో అన్నది ఆసక్తిగా మారింది. మరికొందరేమో ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత నాని పేరు మార్చుకుంటే ఏం బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి…
Also Read :పెళ్లి పీటలు ఎక్కబోతున్న అల్లు శిరీష్.. 10 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా..?
నాని సినీ ప్రస్థానం..
ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుసగా సక్సెస్ అందుకున్న హీరోలల్లో చిరంజీవి తర్వాత నాని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే నాని ఎంతో కష్టపడి సినిమాల్లో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. రేడియో జాకీగా పనిచేసిన నాని. ఆ తర్వాత సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు. అలా తన జర్నీ నీ మొదలుపెట్టిన నాని బొక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారాడు.. ఆ సినిమా తన కెరియర్ ని మలుపు తిప్పేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా అతని కెరియర్ ను ముందుకు నడిపించింది. గత ఏడాది సినిమాలు ఆయన స్థాయిని మరింత పెంచాయి. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం నాని బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా కోర్ట్ అనే సినిమాని నిర్మించారు. ఆ మూవీ కూడా సక్సెస్ అవ్వడంతో నిర్మాతగా మరోసారి తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాని లైఫ్ లో అనేక అద్భుతాలే ఉంటాయి. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ది పారడైజ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సరికొత్త కథతో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది..