OTT Movie : డిఫెరెంట్ స్టోరీలు కావాలి అనుకుంటే, ఓటీటీలో కొన్ని అదిరిపోయే సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక సాధారణ అమ్మాయి, సైకోలా మారిపోతుంది. ఆ తరువాత స్టోరీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
పెర్ల్ అనే యువతి తన తల్లిదండ్రులతో జర్మన్ కి వలస వచ్చి, ఒక ఫామ్‌హౌస్‌లో నివసిస్తుంటుంది. ఆమె భర్త హోవార్డ్ యుద్ధంలో పాల్గొనడానికి విదేశాలకు వెళ్ళి ఉంటాడు. పెర్ల్‌కి సినిమాలపై తీవ్రమైన వ్యామోహం ఉంటుంది. ఆమె తన నటన ద్వారా స్టార్‌డమ్ సాధించాలని కలలు కంటుంది. అయితే ఆమె జీవితం, తాను కన్న కలలకు విరుద్ధంగా ఉంటుంది. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమై ఉంటాడు. ఆమె తల్లి రూత్ కఠినమైన స్వభావం కలిగి ఉంటుంది.పెర్ల్ డ్రీమ్ ని ఆమె తల్లి రూత్ పట్టించుకోకుండా, ఫామ్ పనుల్లో బిజీగా ఉంచుతుంది. పెర్ల్ కి ఒంటరితనం పెరిగిపోతుంది. ఆమె తనకలలు నెరవేర్చుకోవాలనే తపనతో మానసిక స్థితి కూడా అదుపు తప్పుతుంది. ఆ తరువాత విచిత్రంగా ప్రవర్తిస్తుంది. పొలంలో ఉన్న ఒక గడ్డి బొమ్మతో తన మనసులో మట చెప్పుకుంటుంది. ఈ సమయంలో ఆమెకు స్థానిక సినిమా థియేటర్ లో ఒక వ్యక్తితో పరిచయమవుతాడు. అతను ఆమె కలలను ప్రోత్సహిస్తూ, ఆమెతో శృంగార సంబంధం పెంచుకుంటాడు.
అదే సమయంలో, ఆమె సోదరి మిట్జీ ఒక డ్యాన్స్ ఆడిషన్ గురించి పెర్ల్ కి చెబుతుంది. ఇది పెర్ల్‌కి తన జీవితాన్ని మార్చుకునే అవకాశంగా కనిపిస్తుంది. అయితే పెర్ల్ తన తల్లితో ఈ విషయంలో గోడవపడుతుంది. ఈ వాదన హింసాత్మకంగా మారి, పెర్ల్ తన తల్లిని అగ్గి మంటలోకి నెట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడుతుంది. పెర్ల్ ఆమెను బేస్‌మెంట్‌లో బంధిస్తుంది. ఆ తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ కి పెర్ల్ మీద అనుమానం రావడంతో అతన్ని హత్య చేస్తుంది. ఆ తరువాత ఆడిషన్ కి వెళ్తుంది. చివరికి పెర్ల్ ఆడిషన్ లో నటిగా సెలెక్ట్ అవుతుందా ? ఆమె చేతిలో ఎంతమంది పైకి పోతారు ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.
Read Also : రివ్యూ ఇస్తే చంపేసే సైకో… దుల్కర్ సల్మాన్ మోస్ట్ వయొలెంట్ మూవీ
జియో హాట్ స్టర్ (Jio hotstar) లో
ఈ అమెరికన్ హారర్ మూవీ పేరు ‘పెర్ల్’ (Pearl). 2022 లో విడుదలైన ఈ మూవీకి టి వెస్ట్ దర్శకత్వం వహించారు. ఇందులో గోత్ టైటిల్ క్యారెక్టర్ లో నటించగా, డేవిడ్ కోర్న్స్‌వెట్, టాండి రైట్, మాథ్యూ సుందర్‌ల్యాండ్, ఎమ్మా జెంకిన్స్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ 1918లో అమెరికాలోని టెక్సాస్‌లో,పెర్ల్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు సినీ నటి కావాలనే కోరిక తీవ్రంగా ఉండటంతో, హింసాత్మక చర్యలకు పాల్పడుతుంది. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో అందమైన లొకేషన్ లలో జరిగింది. ఇది 2022 సెప్టెంబర్ 3న 79వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని థియేటర్‌లలో 2022 సెప్టెంబర్ 16న విడుదలైంది. ప్రస్తుతం జియో హాట్ స్టర్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.