E-Paper
Advertisement

Crime Thriller OTT : మామూలు సినిమా కాదిది… అమ్మాయిపై ఒళ్ళు గగుర్పొడిచే దారుణాలు… రక్తం మరిగించే క్లైమాక్స్

Crime Thriller OTT : మామూలు సినిమా కాదిది… అమ్మాయిపై ఒళ్ళు గగుర్పొడిచే దారుణాలు… రక్తం మరిగించే క్లైమాక్స్
Advertisement

Crime Thriller OTT : రియల్ స్టోరీల ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు చూస్తే రక్తం మరిగిపోతుంది. అదికూడా మహిళలపై జరిగే దారుణాలను చూస్తే పూనకం వచ్చేస్తుంది కూడా. మరి అలాంటి కథతో ఒక పాకిస్తానీ సినిమా వచ్చింది. ఈ సినిమా చాలా దేశాలలో ప్రశంసలు కూడా అందుకుంది. లాహోర్‌లోని తక్షాలీ గేట్ ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అక్కడ నివసించే తక్కువ వర్గాల ప్రజలు ఎదుర్కొనే వివక్షను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో ఒక పేద డాన్సర్ కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఈ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ పాకిస్థానీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘తక్షాలీ గేట్’ (Taxali Gate). దర్శకుడు అబు అలీహా ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో, కేవలం కొన్ని రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇందులో అయేషా ఒమర్, యాసిర్ హుస్సేన్, మెహర్ బానో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాలో ముస్కాన్ పాత్రలో నటించిన అయేషా ఒమర్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఆమె ఇందులో ఒక డీగ్లామర్, సీరియస్ రోల్‌లో కనిపించారు. 2024 ఫిబ్రవరి 16 వచ్చిన ఈ సినిమా పాకిస్థాన్‌లోనే కాకుండా UK, కెనడా వంటి దేశాల్లో కూడా థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న దక్షిణాసియా ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ‘మేరా హక్ కిధర్ హై’ అనే పాట చాలా ఫేమస్ అయింది. దీన్ని పాకిస్థానీ మహిళా రాపర్ ఈవా బి పాడారు. ఈ సినిమా ప్రస్తుతం KableOne అనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

 స్టోరీ ఏమిటంటే 

Advertisement

లాహోర్‌లోని తక్షాలీ గేట్ అనే రద్దీ ప్రాంతంలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ నివసించే ముస్కాన్ (అయేషా ఒమర్) ఒక డ్యాన్సర్, అదే ప్రాంతంలో ఒక వేశ్యా గృహం కూడా నడుపుతుంటుంది. ఆమె స్నేహితుడు షఫీక్ (యాసిర్ హుస్సేన్) ఒక చిన్న దొంగ. అక్కడే ఉండే జైన్బబ్ కూడా ఒక డాన్సర్ కూతురు. ఆ కుటుంబం తక్కువ కులానికి చెందినది కావడంతో, అందరు వాళ్ళను తక్కువ చేసి చూస్తుంటారు. ఆ ఏరియాలో ఉండే జైన్బబ్ (మెహర్ బానో) అనే అమ్మాయి కూడా ఒక డాన్సర్ కూతురు. అయితే ఆమెను అదే ఏరియాలో ఉండే ఒక పెద్ద మనిషి కొడుకు అత్యాచారం చేస్తాడు. ఈ సీన్స్ చలా దారుణంగా ఉంటాయి. ఈ దారుణం జరిగినప్పుడు ఆ అమ్మాయికి అండగా నిలబడాల్సిన సొసైటీ కూడా ఆమెనే తప్పుబడుతుంది.

మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, పోలీసులు కూడా అమ్ముడుపోతారు. నిందితుడు ఒక పెద్ద మనిషి కొడుకు కావడంతో, కేసును అణచివేయడానికి అబ్దుల్ హమీద్ అనే అవినీతి పోలీస్ ఆఫీసర్ ప్రయత్నిస్తాడు. ఇక ముస్కాన్ షఫీక్ వంటి మామూలు మనుషులే నిజం బయటపెట్టడానికి ప్రాణాలకు తెగించి పోరాడతారు. చివరిగా కోర్టు గదిలో జరిగే వాదనలు ఈ సినిమాకు హైలెట్ అవుతాయి. చివరకు ఈ పోరాటంలో వీళ్ళు గెలిచారా ? ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా ? అనే ఉత్కంఠభరితమైన ముగింపుతో ఈ క్రైమ్ థ్రిల్లర్ ముగుస్తుంది.

Advertisement

Read Also :  వింతలోకంలో మరో వింత… కారణం లేకుండా కత్తులు పట్టే మనుషులు… గాల్లోనే గల్లంతయ్యే ప్రాణాలు

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×