E-Paper
Advertisement

Crime Thriller Series OTT : ఒక హత్య వంద పుకార్ల మర్డర్ మిస్టరీ… ఇన్వెస్టిగేషన్ లో ఊహించని మలుపులు… ఐయండిబిలో 7.9 రేటింగ్‌ ఉన్న సిరిస్

Crime Thriller Series OTT : ఒక హత్య వంద పుకార్ల మర్డర్ మిస్టరీ… ఇన్వెస్టిగేషన్ లో ఊహించని మలుపులు… ఐయండిబిలో 7.9 రేటింగ్‌ ఉన్న సిరిస్
Advertisement

Crime Thriller Series OTT : అబద్ధం ప్రచారం అయినంత వేగంగా నిజం అయితే బయటికి రాదు. ఈ పాయింట్ తో వచ్చిన ఒక తమిళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ బాగా ట్రెండ్ అయింది. దీనికి ఐయండిబిలో 8 రేటింగ్ కూడా ఉందంటే, ఈ సిరీస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో క్లైమాక్స్ వరకు అన్నీ ట్విస్టులే ఉంటాయి. ఒక్కసారి ఎపిసోడ్ చూడటం మొదలుపెడితే చివరిదాక అస్సలు వదలలేరు. స్టోరీ అంతా ఒక మర్డర్ చూట్టూ తిరుగుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ సిరీస్ ను చూడకపోతే ఓ లుక్ వేయండి. మస్త్ మజా ఇచ్చే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘వదంతి: ది ఫేబుల్ ఆఫ్ వెలోని’ (Vadhandhi: The Fable of Velonie). ఆండ్రూ లూయిస్ దీనిని డైరెక్ట్ చేశారు. ఆయన గతంలో విజయ్ ఆంటోనీతో ‘కొలైగాన్’ అనే క్రైమ్ థ్రిల్లర్ కూడా తీశారు. ఈ సిరీస్‌ను పుష్కర్-గాయత్రి నిర్మించారు. వీళ్ళు ‘విక్రమ్ వేద’ సినిమాతో ‘సుడల్: ది వోర్టెక్స్’ వంటి హిట్ సిరీస్‌లతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎస్.జె. సూర్య ఇందులో వివేక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. లైలా, నాజర్, సంజన కృష్ణమూర్తి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇది తమిళ సిరీస్ అయినప్పటికీ, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. 2022 లో ప్రైమ్ వీడియో (Prime video ) లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది చూసిన టాప్ 10 ఇండియన్ సిరీస్‌లలో ఇది ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సీజన్ 2 షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కన్యాకుమారి దగ్గర ఒక ఊర్లో వెలోని అనే ఒక అందమైన అమ్మాయి మర్డర్ అవుతుంది. ఆ శవం దొరకగానే ఊరంతా రకరకాల పుకార్లు మొదలైపోతాయి. ఎవడో ఒకడు ఆ అమ్మాయి క్యారెక్టర్ బాలేదని, ఇంకొకడు ఎవడితోనో లేచిపోయిందని.. ఇలా నోటికొచ్చినట్టు వాగేస్తుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వివేక్ (ఎస్.జె. సూర్య) అనే పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఆ అమ్మాయి మీద పడ్డ నిందల్ని తుడిచేసి, అసలు ఆ కిరాతకుడు ఎవడో పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. వివేక్ ఎంక్వైరీ మొదలుపెడితే, ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటపడతాయి.

ఆ అమ్మాయి చుట్టూ ఉన్నవాళ్లంతా అనుమానితులే కనిపిస్తారు. ఒక పక్క ఆ ఊరి జనం, ఇంకో పక్క మీడియా కలిసి ఆ అమ్మాయి పరువుని బజార్న పడేస్తుంటే.. వివేక్ మాత్రం పట్టు వదల కుండా క్రిమినల్ కోసం వేట కొనసాగిస్తాడు. ఆ అమ్మాయి గతాన్ని తవ్వుతున్న కొద్దీ, ఆమె చుట్టూ ఉన్న మనుషులు ఎంత ముసుగు వేసుకుని బతుకుతున్నారో అర్థమవుతుంది. చివరికి అసలు హంతకుడు ఎవడనేది ఊహించని విధంగా బయటపడుతుంది. అసలు ఆ హంతకుడు ఎవరు ? ఎందుకు ఆ అమ్మాయిని చంపాడు ? వివేక్ ఇన్వెస్టిగేట్ లో నిగ్గు తేలే నిజలు ఏంటి ? అనే విషయాలతో స్టోరీ యమ థ్రిల్లింగ్ గా ఉంటుంది.

Advertisement

Read Also :  అమెరికన్ సినిమాలో ఇండియన్ దెయ్యం… దోస్తులందరికీ చుక్కలు… మస్తు పరేషాన్ చేసే సినిమా

Related News

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

Big Stories

Advertisement
×