E-Paper
Advertisement

Harshit Rana: టీమిండియాకు మ‌రో ఆల్ రౌండ‌ర్ దొరికాడు..ఇక గంభీర్ ను తిట్ట‌కండిరా ప్లీజు

Harshit Rana: టీమిండియాకు మ‌రో ఆల్ రౌండ‌ర్ దొరికాడు..ఇక గంభీర్ ను తిట్ట‌కండిరా ప్లీజు
Advertisement

Harshit Rana:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ లో గిల్ సేన తేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ ను 2-1 తేడాతో న్యూజిలాండ్ గెలుచుకుంది. దీంతో ఇండియా పై 37 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలుచుకున్న రికార్డు సొంతం చేసుకుంది. దీంతో గౌతమ్ గంభీర్, టీమిండియా కెప్టెన్ గిల్ అదే సమయంలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ చెత్త క్రికెటర్ల వల్ల టీమిండియా ఓడిపోయిందని మండిపడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే టీమ్ ఇండియాకు మరో ఆణిముత్యం దొరికినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోoది. ఇంతకీ ఆణిముత్యం ఎవరంటే.. హర్షిత్ రాణా.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

హర్షిత్ రానా రూపంలో టీమిండియా కు మరో ఆల్ రౌండర్

Advertisement

37 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్ మాత్రం అందింది. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో హర్షిత్ రానా అద్భుతంగా ఆడాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. గౌతమ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సిరీస్ ద్వారా నిలబెట్టాడు హర్షిత్ రానా. నిన్న న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడవ వన్డే జరగగా… అద్భుతంగా రాణించాడు. 43 బంతుల్లో 52 పరుగులు చేశాడు హర్షిత్ రాణా. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు కూడా ఉన్నాయి. 120 స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్లాడు హర్షిత్. విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తోని మ్యాచ్ లో ఇరగదీశాడు. న్యూజిలాండ్ స్టార్ బౌలర్లు వేసిన బంతులను కూడా అవలీలగా సిక్సర్లుగా మలిచాడు.

దీంతో టీమ్ ఇండియాకు హర్షిత్ రాణా రూపంలో మరో ఆల్రౌండర్ ఆణిముత్యం దొరికిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక హర్షిత్ రాణా ను తీసుకువచ్చిన గౌతమ్ గంభీర్ పై ప్రశంసల వర్షం కూడా కురుస్తోంది. చాలా రోజుల నుంచి హర్షిత్ ను దారుణంగా ట్రోలింగ్ చేశారు ఫ్యాన్స్. గౌతమ్ గంభీర్ పెద్ద కొడుకు అంటూ ఆడుకున్నారు. కానీ ఆ పెద్దకొడుకే ఇప్పుడు టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివరివరకు నిలవలేదు కానీ… మ్యాచ్ గెలిచి ఉంటే గౌతమ్ గంభీర్ పెద్ద కొడుకు హర్షిత్ పేరు మార్మోగేది. అయితే నిన్నటి ఇన్నింగ్స్ నేపథ్యంలో హర్షిత్ ను మెచ్చుకోవడమే కాకుండా గౌతమ్ గంభీర్ తెలివిని ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్.

37 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా ఓటమి

Advertisement

ఇండోర్ వేదికగా జరిగిన మూడవ వన్డేలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. దీంతో స్వదేశంలో 37 సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది టీమిండియా. మూడో వన్డేలో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 46 ఓవర్లు ఆడిన టీమిండియా 296 వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×