BigTV English
Advertisement

OTT Movie : భార్య ఉండగానే ప్రేయసితో… చిన్న క్లూ కూడా దొరక్కుండా మర్డర్… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా క్లైమాక్స్

OTT Movie : భార్య ఉండగానే ప్రేయసితో… చిన్న క్లూ కూడా దొరక్కుండా మర్డర్… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా క్లైమాక్స్

OTT Movie : ఒక బాలీవుడ్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. పంకజ్ త్రిపాఠి, ష్వేతా బసు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఒక మర్డర్ కేసు చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఇది పంకజ్ త్రిపాఠి వన్ మ్యాన్ షో. న్యాయవాదిగా తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ వుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జియో హాట్ స్టార్ (JioHotstar) లో

ఈ బాలీవుడ్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘క్రిమినల్ జస్టిస్’ (Criminal justice). సీజన్ 4 కి రోహన్ సిప్పీ దర్శకత్వం వహించగా, సమీర్ నాయర్ దీనిని నిర్మించారు. ఈ సిరీస్ 2008 లో వచ్చిన బ్రిటిష్ సిరీస్ ‘క్రిమినల్ జస్టిస్’ఆధారంగా తెరకెక్కింది. ఇది జియో హాట్ స్టార్ (JioHotstar) లో 2025 మే 29న ప్రీమియర్ అయింది. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్, సుర్వీన్ చావ్లా, ఆషా నెగి, ఖుష్బూ ఆత్రే, ష్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సీజన్ 8 ఎపిసోడ్‌లతో రూపొందింది. ఇందులో ముందుగా మొదటి మూడు ఎపిసోడ్‌లు ప్రీమియర్‌లో అయ్యాయి. మిగిలినవి ప్రతి గురువారం వారీగా విడుదలయ్యాయి. జూలై 3, 2025న ఫినాలేతో ముగిసింది. ఈ స్టోరీ ఒక కుటుంబలో జరిగిన హత్య మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషలలొ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కి IMDB లో 7.4/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ సిరీస్ సీజన్ 4 కథ ముంబైలో జరుగుతుంది. డాక్టర్ రాజ్ నాగ్‌పాల్, అతని భార్య అంజు నాగ్‌పాల్ తో విడిపోయి ఉంటాడు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ, తమ కుమార్తె ఐరా కోసం ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తారు. ఐరాకు ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ అనే మానసిక సమస్య ఉంటుంది. ఆమె సంరక్షణ కోసం రోష్ని సలూజా అనే నర్స్ ని నియమించుకుంటారు. రోష్ని క్రమంగా రాజ్ జీవితంలో భాగమవుతుంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరికీ తెలుస్తుంది. ఈ విషయం అంజు, రాజ్ తల్లి కమలా సహా అందరూ అంగీకరించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అంజు ముందే రాజ్ తో సన్నిహితంగా ఉంటుంది రోష్ని.    ఒక రోజు ఐరా పుట్టినరోజు వేడుక తర్వాత రాజ్ ఫ్లాట్‌లోకి అంజు, పనిమనిషి కమలా వస్తారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న రోష్నిని రాజ్ పట్టుకొని ఉండటం చూస్తారు. రోష్ని గొంతు కోసిన స్థితిలో చనిపోయి ఉంటుంది. ఆ తరువాత రాజ్ ను ప్రధాన నిందితుడిగా అరెస్టు చేస్తారు.  అంజు తన భర్తను రక్షించడానికి, ప్రముఖ న్యాయవాది మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి) సహాయం కోరుతుంది. అతను ఈ కేసును వాదించడానికి ముందుకు వస్తాడు.

ఆ తరువాత అంజును కూడా హత్య కేసులో నిందితురాలిగా అరెస్టు చేస్తారు. మాధవ్ మిశ్రా తన విలక్షణమైన తెలివి తేటలతో ఈ కేసును విచారిస్తాడు. ఇప్పుడు రాజ్, అంజు ఇద్దరూ హత్యకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటారు. రోష్ని హత్య వెనుక ఉన్న నిజమైన హంతకుడు ఎవరనేది ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. ఇది ప్రేక్షకులను చివరి ఎపిసోడ్ వరకు ఊహించేలా చేస్తుంది. ఈ ఎపిసోడ్‌లు ముందుకు సాగే కొద్దీ, ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా నడుస్తాయి. రోష్ని హత్య వెనుక ఉన్న నిజం చివరి క్షణాల వరకు రహస్యంగా ఉంటుంది. ఈ సిరీస్ ఎనిమిదవ ఎపిసోడ్ ఒక ఊహించని మలుపుతో ముగుస్తుంది. చివరికి రోష్నిని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? మాధవ్ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : పని మనిషితో యజమాని రాసలీలలు… డార్క్ కామెడీ మూవీ లవర్స్ కు పండగో

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×