OTT Movie : వెబ్ సిరీస్ లను ఇప్పుడు ఓటీటీలో ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. వీటిలో సెన్సార్ లేని కొన్ని సన్నివేశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు కొంతమంది అభిమానులు. అలా పాపులర్ అయిన వెబ్ సిరీస్ లలో, ఒక సిరీస్ ఓటీటీలో దుమ్ము దులుపుతోంది. ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. సీజన్ 1, సీజన్ 2 కూడా అలాంటి సీన్స్ తో మతిపోగొట్టింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ బాలీవుడ్ ఆంథాలజీ వెబ్ సిరీస్ పేరు ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories 2). ఇది 2018లో విడుదలైన ‘Lust Stories’కి సీక్వెల్ గా వచ్చింది. ఈ సిరీస్ నాలుగు స్టోరీలతో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఆర్. బాల్కీ, కొంకణా సేన్ శర్మ, అమిత్ రవీందర్‌నాథ్ శర్మ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇది 2023 జూన్ 29న విడుదలైంది. ఇందులో కాజోల్, మృణాళ్ ఠాకూర్, నీనా గుప్తా, తమన్నా భాటియా, విజయ్ వర్మ, తిలోత్తమ షోమ్, అమృతా సుభాష్, కుముద్ మిశ్రా నటించారు. ఈ సిరీస్ 2023 ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్‌లో ఐదు నామినేషన్లు సాధించింది. ఇందులో బెస్ట్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్, అమృతా సుభాష్‌కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డులకు గెలుచుకుంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు స్టోరీలతో ఈ సిరీస్ నడుస్తోంది.
1.’మేడ్ ఫర్ ఈచ్ అదర్’ (Made for Each Other)
ఇందులో వేదా, అర్జున్ అనే జంట పెళ్ళికి చేసుకోవడానికి సిద్దపడుతుంటారు. ఈ క్రమంలో వేదాకి ఆమె ఓపెన్-మైండెడ్ అమ్మమ్మ ఒక షాకింగ్ ప్రశ్న వేస్తుంది. పెళ్ళికి ముందే ఆ పని జరిగిందా ? అని అడుగుతుంది. కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేయడం ఎంత ముఖ్యమో,పెళ్ళికి ముందు పని అవ్వడం కూడా అంతే ముఖ్యమని వాదిస్తుంది. ఇక ఆమె మాటలు విన్న వేదా, అర్జున్ ని ఒక హోటల్ గదిలోకి తీసుకెళ్తుంది. ఈ ప్రయత్నం, కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలకు దారితీస్తుంది.
2. ‘ది మిరర్’ (The Mirror)
ఈ సెగ్మెంట్ ఆంథాలజీలో అత్యంత ప్రశంసలు పొందింది. ఇషితా అనే ఒక మధ్యతరగతి మహిళ , తన భర్తను సీమా అనే పని మనిషితో సన్నిహితంగా ఉండటాన్ని అద్దం ద్వారా చూస్తుంది. ఈ సీన్ చూసిన ఆమెకు భర్త మీద కోపం రావడానికి బదులు, ఆమెలో ఇంకా కోరికలు పెరుగుతాయి. ఇక ఇషితా, సీమా ఒక విచిత్రమైన ఒప్పందానికి వస్తారు. వీళ్లిద్దరి సంబంధానికి ఇషితా ఒప్పుకుంటుంది. కానీ వాళ్ళు ఏకాంతంగా గడిపే సన్నివేశాలను మాత్రం చూస్తూ ఉంటుంది.
3. ‘సె*క్స్ విత్ ఎక్స్’ (Sex with Ex)
డేవిడ్ చౌహాన్ అనే ఒక వ్యాపారవేత్తకి , ఒక రోడ్డు ప్రమాదంలో తన కారు రిపేర్ అవుతుంది. దీనిని రిపేర్ చేయడానికి మెకానిక్ కోసం వెతుకుతూ, తన మాజీ భార్య శాంతిని ఊహించని విధంగా కలుస్తాడు. ఆమె చనిపోయిందని అనుకున్న అతను, ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడు. ఈ రీయూనియన్ వారి గత జ్ఞాపకాలు, లోపల దగిఉన్నకోరికలు మళ్ళీ బయటకి వస్తాయి. ఆ తరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది.
4. ‘తిల్చట్టా’ (Tilchatta)
రాజస్థాన్‌లోని ఒక గ్రామీణ రాజవంశంలో ఈ స్టోరీ జరుగుతుంది. ఈ కథలో, దేవయాని అనే మహిళను, సురజ్ సింగ్ అనే జమీందారు ఏకాంత సమయంలో టార్చర్ చేస్తుంటాడు. అతను మద్యపానానికి బానిస అయిన వ్యక్తి. ఇతర మహిళలపై కూడా ఇలానే దౌర్జన్యం చేస్తుంటాడు. నిజానికి దేవయాని ఒకప్పుడు వేశ్య గా ఉండేది. ఆమెకు HIV పాజిటివ్ అని తెలిసి, సురజ్ సింగ్ భార్య రేఖ తనని పనిలో పెట్టుకుంటుంది. ఆమె ద్వారా సురజ్ సింగ్ కు HIV వచ్చేలా చేయాలని ఆమె ప్లాన్ వేస్తుంది. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ పై ఓ లుక్ వేయండి.
Read Also : భర్త ఉండగానే ఆఫీసులోనే కుర్రాడితో దుకాణం పెట్టే హీరోయిన్… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే