E-Paper
Advertisement

మలయాళం నుంచి తెలుగు వరకు… ఈ రోజు ఒక్క రోజే ఓటీటీలోకి 4 కొత్త సినిమాలు

మలయాళం నుంచి తెలుగు వరకు… ఈ రోజు ఒక్క రోజే ఓటీటీలోకి 4 కొత్త సినిమాలు
Advertisement

New Movies OTT : ఈ వారం ఓటీటీ ప్రియుల కోసం బోలెడంత వినోదం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్ సీజన్ 2’ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మరికొన్ని కొత్త సినిమాలు కూడా ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధం అయ్యాయి. థ్రిల్, సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్… ఇలా ప్రతి జానర్ ప్రేక్షకుల కోసం మలయాళం నుంచి తెలుగు వరకు 4 కొత్త సినిమాలు ఈ ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చేశాయి. మరి ఆ సినిమాలు ఏంటి ? ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lukkhe Web Series

మ్యూజికల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ గా రూపొందింది “లుక్కే”. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌ కు హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించగా, ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వైట్ గొరిల్లా LLP బ్యానర్ల క్రింద విపుల్ డి. షా, రాజేష్ బహల్ సంయుక్తంగా నిర్మించారు. “లుక్కే” కథ చండీగఢ్‌లోని ర్యాప్ సంస్కృతి, స్ట్రీట్ ఫైట్ వంటి అంశాల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో “MC బద్నామ్” – “OG” అనే ఇద్దరు ర్యాపర్‌ ల మధ్య ఫైట్ జరుగుతుంది. వారి వైరం ప్రతీకారం, కలలు, జీవిత ప్రయాణాన్ని ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ ట్యాగ్‌లైన్ “ర్యాప్ అండ్ ప్రతీకారం, రెండూ గట్టివే”. దానికి తగ్గట్టే ఉంటుంది సిరీస్. మే 8 నుంచి ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి రానుంది.

Vaazha 2 : Biopic of a Billion Bros

Advertisement

మలయాళ కామెడీ-డ్రామా “వాజా II” గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు 10 కోట్ల బడ్జెట్‌ తో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 233 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. సమాజం నుండి వెలివేయబడిన నలుగురు స్నేహితులు హషీర్, అలన్, అజిన్, వినాయక్ ల చుట్టూనే ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. వాళ్ళు లైఫ్ లో ల సెట్ అయ్యారు అన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ కూడా 8వ తేదీ నుంచి హాట్‌స్టార్‌ (JioHotstar)లో వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

Dacoit

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన మూవీ ‘డెకాయిట్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా రాణించలేదు. 13 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి తప్పించుకున్న హరిదాస్, అతని ప్రేయసిపై ఎలా పగ తీర్చుకున్నాడు ? అనేదే కథ. తనపై తప్పుడు కేసు పెట్టిన తన మాజీ ప్రేయసి సరస్వతిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది స్టోరీ. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, జరీనా వహాబ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది.

Bharatanatyam 2 : Mohiniyattam

Advertisement

మలయాళ కామెడీ-థ్రిల్లర్ సీక్వెల్ గా రూపొందిన మూవీ “భరతనాట్యం 2: మోహినియాట్టం”. సైజు కురుప్, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించిన ఈ సినిమా కూడా ఈరోజు నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కుటుంబ పెద్ద భరతన్ నాయర్ చనిపోవడంతో, అతని రెండవ జీవితానికి సంబంధించిన రహస్యాలు బయట పడతాయి. అలాగే అనుకోకుండా జరిగిన ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించే శశి (సైజు కురుప్), అతని కుటుంబానికి ఏం జరిగింది ? అన్నదే కథ. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటుంది ఈ మూవీ.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×