OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో వస్తున్న సినిమాలను భాషతో ప్రమేయం లేకుండా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. బెంగాల్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కథలతో సినిమాలను తరికెక్కిస్తున్నారు మేకర్స్. రివేంజ్ థ్రిల్లర్ తో వచ్చిన ఒక బెంగాలీ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రియుడు చావుకి కారణమైన వాళ్ళపై, పగ తీర్చుకునే స్టోరీతో ఈ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బెంగాలీ మూవీ పేరు ‘పరిణీత‘ (Parineeta). 2019 లో వచ్చిన ఈ మూవీకి రాజ్ చక్రవర్తి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించి, నిర్మించారు. ఈ మూవీలో అద్రిత్ రాయ్ కీలక పాత్ర పోషించారు. ఆర్కో ప్రవో ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ మూవీ 6 సెప్టెంబర్ 2019న థియేటర్లలో విడుదలైంది. శ్రేయా ఘోషల్ పాడిన “తోమాకే” పాట 2019 లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగాలీ పాటలలో ఒకటి గా నిలిచింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ప్రియా స్కూల్లో చదువుకునే రోజు నుంచి ప్రియా ఇష్టపడుతూ ఉంటుంది. ఆమెకు విక్కీ ట్యూషన్ కూడా చెప్తూ ఉంటాడు. ఇలా విక్కీ మాత్రం ప్రియాని మంచి ఫ్రెండ్ గా చూస్తుంటాడు. అయితే ఒక రోజు హోలీ పండగ వస్తుంది. అందరూ హోలీ మంచిగా ఆడుతున్నప్పుడు, ప్రియా దగ్గరికి విక్కీ వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. చెప్పడమే కాకుండా అమ్మాయిని కూడా పరిచయం చేస్తాడు. అప్పటినుంచి హీరోయిన్ చాలా డిప్రెషన్ లోకి వెళుతుంది. విక్కితో మాట్లాడటమే మానేస్తుంది. విక్కీ అంత ప్రయత్నించిన తనని దూరం పెడుతుంది. ఒకరోజు విక్కి ఆమెకు ఒక లెటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి సూసైడ్ కూడా చేసుకుంటాడు. ఈ విషయం తెలిసి ప్రియా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత విక్కీఇచ్చిన లెటర్ ని చదివి చాలా బాధపడుతుంది. ఒకరోజు విక్కీ పనిచేసే కంపెనీకి ఇంటర్వ్యూలో జాబ్ కి సెలెక్ట్ అవుతుంది ప్రియా. అక్కడ ఆ కంపెనీ మేనేజర్ దేవ్ తో క్లోజ్ గా ఉంటుంది. ఒకరోజు ప్రియని దేవ్ ఒక హోటల్ కి ఇన్వైట్ చేస్తాడు. అక్కడికి వచ్చి ఆమె దేవ్ తో నీకు విక్కీ తెలుసా అని అడుగుతుంది. విక్కీ ఎవరు అని అడుగుతాడు దేవ్.
నిజానికి ఇప్పుడున్న దేవ్ భార్య, విక్కీ లవ్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి ఒక రోజు దేవ్ తో క్లోజ్ గా ఉండడం విక్కీ చూస్తాడు. విషయం ఎవరికైనా చెప్తాడేమో అని, విక్కీ తనపై అఘాయిత్యం చేశాడని పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. చేయని తప్పుకు విక్కీ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. అందరూ తనని అనుమానించడంతో, కనీసం ప్రియా అయినా నన్ను నమ్ముతుందేమో అని ఆమెకు చెప్పడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు ప్రియా అతన్ని దూరం పెట్టడంతో, లెటర్ ఇచ్చి వెళ్లి ఉంటాడు. ఆ లెటర్లో తనకు జరిగిన అన్యాయాన్ని రాసి, ఈ లెటర్ చదివే లోగా నేను చనిపోయి ఉంటాను అని విక్కీ రాస్తాడు. విక్కీ చావుకి రివైంజి తీసుకోవడానికి ఈ కంపెనీలో చేరుతుంది ప్రియ. గెస్ట్ హౌస్ లో ప్రియ మీద దేవ్ అసభ్యంగా ప్రవర్తించడంతో, అతనిపై గట్టిగా దాడి చేస్తుంది ప్రియ. పోలీసులకి కూడా అతనిపై కంప్లైంట్ ఇస్తుంది. దేవ్ తో పాటు, విక్కీని అనవసరంగా ఇరికించిన అమ్మాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా తన ప్రియుడి మరణానికి కారణమైన వాళ్లకు శిక్ష పడేలా చేస్తుంది ప్రియ.