OTT Movie : హారర్ సినిమాలకి ఓటిటి ప్లాట్ ఫామ్ లో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఈ సినిమాలు కొన్ని కామెడీగాను, మరికొన్ని వణుకు పుట్టించే విధంగాను ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో రెండు కలిపి ఉంటాయి. థాయిలాండ్ నుంచి వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ థాయ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెత్ విస్పరర్‘ (Death Whisperer). 2023 లో వచ్చిన ఈ ‘డెత్ విస్పరర్’ మూవీకి థావీవాట్ వాంటా దర్శకత్వం వహించారు. ఒక ఫామిలిని ఇబ్బంది పెట్టే ఆత్మతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఇందులో నాడెచ్ కుగిమియా, రత్తనవాడీ వాంగ్‌థాంగ్, డెనిస్ జెలిల్చా కపౌన్, కర్జ్-బండిట్ జైదీ, పీరకిత్ పచ్చరబున్యాకియాట్, అరిసర వాంగ్‌చలీ, పారామెట్ నోంగ్‌చలీ నటించారు. మేజర్ జాయిన్ ఫిల్మ్, బిఇసి వరల్డ్, బిఇసి వరల్డ్, మేజర్ జాయిన్ ఫిల్మ్ జాయింట్ వెంచర్ ద్వారా ఈ మూవీ నిర్మించబడింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జూనిన్, యూనిన్ అనే జంటకి ఆరుగురు సంతానం ఉంటారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలు సంతానం ఉంటుంది. ఈ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. అయితే ఆ ప్రాంతంలో కొన్ని వింత ఆకారాలు తిరుగుతూ వీళ్ళను భయపెడుతూ ఉంటాయి. అక్కడ పనిచేసే వాళ్లు కూడా వాటికి భయపడి అక్కడినుంచి వెళ్ళిపోతుంటారు. ఒకరోజు ఆ ఇంట్లో చివరి అమ్మాయి కనపడకుండా పోతుంది. ఆమెను వెతుక్కుంటూ అన్నయ్యలు వెళ్తారు. ఒకచోట ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఉంటుంది అ అమ్మాయి. ఇంటికి తీసుకువచ్చిన ఆమె ప్రవర్తనలో ఏదో మార్పు కనపడుతుంది. ఆ ఊరిలో ఉండే ఒక మంత్ర గాడిని ఇంటికి పిలిపిస్తారు. అయితే ఈమెలోకి ఒక ఆత్మ ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని ఆ మంత్రగాడు చెప్తాడు. దయ్యం చేతబడి చేసి అమ్మాయిలోకి ప్రవేశించడానికి సిద్దంగా ఉందని చెప్తాడు. దయ్యం చేతబడి చేయటం ఏంటని, ఇతడి మాటలను పెద్దగా పట్టించుకోకుండా ఆ కుటుంభ సభ్యులు లైట్గా తీసుకుంటారు.
అయితే ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి పంటిని విరగ్గొట్టి ఆ దయ్యం తీసుకుపోతుంది. అప్పుడు అర్థమవుతుంది ఆ కుటుంబ సభ్యులకు, దయ్యం నిజంగానే ఈ ఇంట్లో ఉందని. ఈ ఫ్యామిలీ ఆ దయ్యాన్ని బెదరగొట్టడానికి ట్రై చేస్తుంటారు. ఆ దయ్యం శాశ్వతంగా ఆ అమ్మాయి బాడీలో వెళ్ళిపోవడానికి వస్తుంది. చివరికి ఈ కుటుంబం ఆత్మను బంధిస్తారా? ఇంతకీ ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ వలన ఈ కుటుంబ సభ్యులకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘డెత్ విస్పరర్’ (Death Whisperer) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.