BigTV English

Daaku Maharaj Collection : డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య మూవీకి ఎన్ని కోట్లంటే..?

Daaku Maharaj Collection : డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య మూవీకి ఎన్ని కోట్లంటే..?

Daaku Maharaj Collection : టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య ఈ మధ్య వరుసగా సినిమాలను అనౌన్స్ చెయ్యడం మాత్రమే కాదు.. వయసు పెరుగుతున్నా కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు.. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే, మరో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన బాలయ్య మూవీ డాకు మహారాజ్.. ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ను అందుకుంది ఈ మూవీ . ఇప్పుడు వీకెండ్ బాగా కలిసివచ్చింది. ఎనిమిది రోజులకు ఎన్ని కోట్లు అందుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


బాలయ్య సినిమాలకు మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు.. ఆయన కొత్త సినిమాల కోసం తెలుగుతో పాటుగా ఓవర్సీస్ అభిమానులు కూడా వెయిట్ చేస్తుంటారు.. బాలయ్య డైలాగులకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈమధ్య సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఈ ఏడాది మాస్ యాక్షన్ మూవీ డాకు మహారాజు అంతకుమించి రికార్డులను బ్రేక్ చేసింది. మొదటి షోతో మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం దులిపేస్తుంది.. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీ మొదటి రోజే 56 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత రోజు నుంచి ఓపెనింగ్స్ తగ్గకుండా కలెక్షన్స్ను వసూల్ చేస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.. ఇక ఎనిమిది రోజులకు ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

డాకు మహారాజ్ ఏడు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. బాలయ్య కెరియర్ లోనే అత్యంత భారీ ఓపెనింగ్ రాబట్టిన సినిమా ఈ డాకు మహారాజ్. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 56 కోట్లు వసూలు చేసింది.. రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.18 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. సినిమా కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. ఇక ఐదు రోజులకు 125 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. ఆరో రోజు తగ్గకుండా 129 కోట్లు వసూల్ చేసింది. ఇక ఏడో రోజు కూడా అంతకు మించి తగ్గకుండా 140 వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఎనిమిదోవ రోజు 155 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది.. 8 రోజుల కలెక్షన్స్ గురించి డాకు మహరాజ్ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.. ఇక ఇదే జోరులో మూవీ రన్ అయితే మాత్రం 200 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×