OTT Movie : సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాలలో రకరకాల ఏలియన్స్ ని చూపిస్తుంటారు. ఈ జానర్ లో వచ్చే సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఇందులో కాలేజ్ అమ్మాయిల రూపంలో ఉన్న ఏలియన్స్, మానవులతో సంతానోత్పత్తి కోసం వచ్చి, వాళ్లను చంపేస్తుంటాయి. ఈ సినిమా కాస్త కామెడీ, కాస్త వైలెంట్ గా ఉంటుంది. మొత్తానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘డికాయ్స్’ (Decoys) మాథ్యూ హాస్టింగ్స్ డైరెక్ట్ చేసిన కెనడియన్ సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా. ఇందులో కోరీ సెవియర్ (లూక్), స్టెఫానీ వాన్ ఫెట్టెన్ (లిల్లీ), కిమ్ పోయిరియర్ (కాన్స్టాన్స్) మెయిన్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా Amazon Prime Video, Tubiలో స్ట్రీమింగ్‌లో ఉంది. 1 గంట 35 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈసినిమాకి IMDbలో 4.7/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళ్తే
సెయింట్ జాన్ కాలేజ్‌లో లూక్, రోజర్ అనే ఇద్దరు స్టూడెంట్స్ వర్జిన్స్‌గా ఉండి, అమ్మాయిలతో సెట్ అవ్వాలని ఆరాటపడుతుంటారు. ఒక రోజు వీళ్ళు లిల్లీ , కాన్స్టాన్స్ అనే కజిన్స్‌ని కలుస్తారు. ఆసమయంలో లూక్, లిల్లీ ఛాతీ నుండి రెప్టిలియన్ టెంటకిల్స్ బయటకు వచ్చి, కాన్స్టాన్స్ ఆమెపై లిక్విడ్ నైట్రోజన్ స్ప్రే చేయడం చూస్తాడు. షాక్‌లో లూక్ తన స్నేహితురాలు అలెక్స్ తో ఈ అమ్మాయిలు ఏలియన్స్ అని చెబుతాడు. కానీ ఎవరూ నమ్మరు. ఇదే సమయంలో, బాబీ అనే కాలేజ్ స్టూడెంట్ శవం, నోరు తెరిచిన స్థితిలో దొరుకుతుంది. పోలీసులు దీన్ని మిస్టరీగా భావిస్తారు. ఇప్పుడు లూక్, అలెక్స్ ఈ ఏలియన్స్‌ని బయటపెట్టడానికి ప్లాన్ వేస్తారు. లూక్, లిల్లీతో బెడ్‌రూమ్ సీన్‌లో కెమెరా పెట్టి, ఆమె టెంటకిల్స్‌ని రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కెమెరా పాడవుతుంది.
Read Also : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి
లిల్లీ, లూక్ ని చంపబోతుంది. కానీ ఒక క్యాండిల్ వల్ల ఫైర్ స్టార్ట్ అవుతుంది. లిల్లీ ఏలియన్ రూపంలోకి మారి, ఆ హీట్‌కి భయపడి పారిపోతుంది. ఇదే సమయంలో కాన్స్టాన్స్, రోజర్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. తమ రేస్ మనుగడ కోసం మగవాళ్లను ఇంప్రెగ్నేట్ చేయడానికి వచ్చామని చెబుతుంది. కానీ ఈ ప్రాసెస్‌లో మగవాళ్లు చలికి భరించలేక చనిపోతారని తెలుస్తుంది. రోజర్ కాన్స్టాన్స్‌తో డేట్ చేయడానికి అంగీకరిస్తాడు. కానీ ఆపనిలో ఉండగా అతను చనిపోతాడు. ఒక ఏలియన్ బేబీ అతని నోటి నుండి బయటకు వస్తుంది. ఆతరువాత లూక్, ఏలియన్స్ హీట్‌కి భయపడతాయని తెలుసుకుని, డిటెక్టివ్ అమండాతో కలిసి ఫ్లేమ్‌త్రోవర్‌తో లిల్లీని చంపేస్తాడు. కాన్స్టాన్స్‌ని కూడా స్టీమ్ పైప్‌లతో చంపబోతుంటే, అమండా ఆమెను షూట్ చేస్తుంది. చివర్లో లూక్, అలెక్స్‌తో డేట్ కి రెడీ అవుతాడు. కానీ అలెక్స్ కూడా ఏలియన్‌గా రివీల్ అవుతుంది. ఇక అలెక్స్ కూడా ఈ ఏలియన్స్ చేతిలో బలవుతాడా ? బతికి బయటపడతాడా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.