OTT Movie : ఓటీటీలోకి రకరకాల సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. వీటిలో కొన్ని సినిమాలు చివరివరకూ ఆసక్తికరంగా నడుస్తుంటాయి. ఈ సినిమాలో ఒక మహిళకి విపరీతమైన కోపం సమస్యగా మారుతుంది. ఈ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఒక షాక్ వెస్ట్ ధరిస్తుంటుంది. ఇక ఈ స్టోరీ తన ప్రేమికుడి హత్య రహస్యాన్ని వెలికితీసే ఒక యాక్షన్ రివెంజ్ గా మారుతుంది. ఈ సినిమా ఫాస్ట్-పేస్డ్ యాక్షన్, బ్లాక్ కామెడీతో నిండి ఉంటుంది. దీని పేరు ఏమిటి ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
ఎందులో ఉందంటే
‘జోల్ట్’ (Jolt) తాన్యా వెక్స్లర్ డైరెక్ట్ చేసిన యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో కేట్ బెకిన్సేల్ (లిండీ), జై కోర్ట్నీ (జస్టిన్), స్టాన్లీ టుచీ (డాక్టర్ మంచిన్) మెయిన్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా 2021 జులై 23న Amazon Prime Videoలో రిలీజ్ అయింది. 1 గంట 31 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.6/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా ఇంగ్లీష్ ఆడియోతో తెలుగు, హిందీ సబ్‌టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ ఏమిటంటే
లిండీ అనే మహిళకు చిన్నప్పటి నుంచి ఇంటర్‌మిటెంట్ ఎక్స్‌ప్లోసివ్ డిసార్డర్ అనే మానసిక సమస్య ఉంటుంది. దీనివల్ల ఆమె చిన్న విషయానికి కూడా ఆగ్రహంతో హింసకు పాల్పడుతుంది. ఆమె శరీరంలో అధిక కార్టిసాల్ హార్మోన్ వల్ల అసాధారణ శక్తి కూడా వస్తుంది. దీనివల్ల ఆమెను సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉపయోగించుకుంటాయి. ఆమె కోపాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్ మంచిన్ ఒక ఎలక్ట్రోషాక్ వెస్ట్ డిజైన్ చేస్తాడు. దాన్ని ధరించి లిండీ బటన్ నొక్కితే షాక్‌తో ఆమె ఆగ్రహం అదుపులోకి వస్తుంది. కానీ ఈ వెస్ట్ తాత్కాలిక పరిష్కారమేనని, ఆమెకు ప్రేమ, సంబంధాలు కావాలని మంచిన్ చెబుతాడు. లిండీ, జస్టిన్ అనే అకౌంటెంట్‌తో బ్లైండ్ డేట్‌లో కలుస్తుంది. అతని సాఫ్ట్ నేచర్‌కి ఆమె ఆకర్షితురాలవుతుంది. కానీ వాళ్ల మూడో డేట్ ముందు, జస్టిన్ హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతారు.
Read Also : ఇది సినిమానా, చికెన్ షాపా మావా? ఒక్కో పార్ట్ కట్ చేసి ఏందా అరాచకం… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ
లిండీ, జస్టిన్ హత్య వెనక రహస్యాన్ని కనిపెట్టడానికి రివెంజ్ జర్నీ స్టార్ట్ చేస్తుంది. లిండీ, జస్టిన్ ఫోన్‌ని పోలీస్ స్టేషన్ నుంచి దొంగిలించి, అతని బాస్ బ్యారీ కస్పర్జ్కీ అనే ఆయుధాల డీలర్‌ని గుర్తిస్తుంది. బ్యారీని ఇంటరాగేట్ చేసి, గారెత్ ఫిజెల్ అనే ఒక బిలియనీర్, జస్టిన్ హత్య వెనక ఉన్నాడని తెలుసుకుంటుంది. లిండీ, ఫిజెల్ ఆఫీస్‌లోకి వెళ్తుంది, కానీ అతని సెక్యూరిటీ హెడ్ డెలాక్రాయ్ ఆమెను బెదిరిస్తాడు. ఆతరువాత లిండీ ఇంట్లో బాంబ్ పెట్టిన ఫిజెల్ గ్యాంగ్, ఆమె చనిపోయిందనుకుంటుంది. కానీ లిండీ బాంబ్‌ని డిసార్మ్ చేసి, ఫిజెల్ ఆఫీస్‌లోకి మళ్లీ వెళ్తుంది. అక్కడ ఆమెకు షాకింగ్ ట్విస్ట్ ఎదురుపడుతుంది. జస్టిన్ ఇంకా బతికే ఉంటాడు. అతను మరెవరూ కాదు, CIA ఏజెంట్. జస్టిన్, ఫిజెల్‌ని చంపడానికి లిండీని వాడుకుని, ఆమెను మోసం చేశాడు. లిండీ ఫిజెల్‌ని చంపుతుందా ? జస్టిన్ ను క్షమిస్తుందా ? అనే విషయాలను ఈ యాక్షన్ మూవీని చూసి తెలుసుకోండి.