E-Paper
Advertisement

Sukumar- Ram charan : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రంగంలోకి దిగిన సుకుమార్..

Sukumar- Ram charan : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రంగంలోకి దిగిన సుకుమార్..
Advertisement

Sukumar- Ram charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. మెగా వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన టాలెంట్ తో అతికొద్ది రోజుల్లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు గతంలో ఒక ఎత్తు.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మాస్ యాక్షన్ మూవీ రంగస్థలం. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత క్లాస్ హీరో మాస్ హీరో అయ్యాడు. తన లైఫ్ లో ఈ మూవీ మరో మైలు రాయిగా మారింది. ఈ మూవీకి సీక్వెల్ గా రంగస్థలం 2 రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. మెగా ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్..

‘రంగస్థలం 2’ కి ముహూర్తం ఫిక్స్..

Advertisement

అల్లు అర్జున్ ని సుకుమార్ పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో బన్ని ఇంటర్నేషనల్ రేంజుకు ఎదిగాడు. పుష్పరాజ్ హవాకు ఇప్పుడు ఎదురే లేదు.. స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ ను చేశాడు. అల్లు అర్జున్ తర్వాత గ్లోబల్

స్టార్ రామ్ చరణ్‌తో సుక్కూ తన కమిట్ మెంట్ ని ఫుల్ ఫిల్ చేయాల్సి ఉంది. గతంలో చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన గోదావరి నేపథ్య మూవీ రంగస్థలం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ రాబోతుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ ట్రిప్ ను ముగించుకున్న సుకుమార్ ఈ మూవీ స్క్రీఫ్ట్ పై దృష్టి పెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ పై పని జరుగుతోంది. బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాగానే చరణ్ కి ఫైనల్ గా కథాంశాన్ని వినిపిస్తాడు. దుబాయ్ లో స్క్రిప్టు పనులు చేసేందుకు సుకుమార్ ఎంతో ఆసక్తిగా ఉన్నారని టాక్.. ఈ మూవీని సుక్కు స్వయంగా తెరకెక్కిస్తారు.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

Also Read : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ మూడు వెరీ స్పెషల్..

రామ్ చరణ్ సినిమాలు.. 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రియేట్ ని సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటించాడు ఆ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది.. కానీ ఫాన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం బుచ్చిబాబు కాంబినేషన్లో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఏ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయబోతుంది.. ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం. అందులో ముందుగా రంగస్థలం 2 సినిమాని పూర్తి చేసే అవకాశం ఉంది. మరి ఈ మూవీ తో సుకుమార్, రామ్ చరణ్ ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటారో చూడాలి..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×