BigTV English

OTT Movie : చెట్టుకు శవాలుగా వేలాడే అమ్మాయిలు… ప్రతీ సీను క్లైమాక్స్ లా ఉండే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చెట్టుకు శవాలుగా వేలాడే అమ్మాయిలు… ప్రతీ సీను క్లైమాక్స్ లా ఉండే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :  సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా అంజలి విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోంది. ఆమె బలమైన కంటెంట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె వేశ్య పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మంచి వ్యూస్ తో ఆకట్టుకుంటోంది. గ్రామీణ వాతావరణం కూడా ఈ సిరీస్ కి హైలెట్ గా నిలిచింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఏ ఓటీటీలో ఉందంటే

‘బహిష్కరణ’ (Bahishkarana) 2024లో విడుదలైన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్. దీనికి ముకేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. ప్రశాంతి మాలిశెట్టి నిర్మించిన ఈ సిరీస్ పిక్సెల్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లో ZEE5తో నిర్మాణంలో రూపొందింది. ఇందులో అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముఖ్, మహబూబ్ బాషా, చైతన్య సాగిరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ1990లో గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామంలో ఒక రివెంజ్ డ్రామాగా రూపొందింది. ఈ సిరీస్ 2024 జులై 19న ZEE5లో 8 ఎపిసోడ్‌లతో ప్రీమియర్ అయింది. దీనికి IMDbలో 7.3/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ కథ 1990లో గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ శివయ్య (రవీంద్ర విజయ్) అనే వ్యక్తి ఒక దుర్మార్గపు సర్పంచ్ గా పేరు తెచ్చుకుని ఉంటాడు. పెద్దపల్లి చుట్టూ ఉన్న పది గ్రామాలను, డబ్బు, అధికారంతో నిరంకుశంగా పాలిస్తుంటాడు. శివయ్య ముఖ్యంగా మహిళలపై తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ, వారి జీవితాలను నాశనం చేస్తుంటాడు. వయసులో ఉన్న అమ్మాయిలు ఇతని వల్ల చనిపోతూ ఉంటారు.
ఈ సమయంలో పుష్ప (అంజలి) అనే ఒక వేశ్య గ్రామంలోకి వస్తుంది. కానీ ఆమె జీవితం అతని క్రూరత్వం వల్ల బాధలతో నిండిపోతుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) అనే ఒక యువకుడు, పుష్పతో ప్రేమలో పడతాడు. పుష్ప కూడా అతనిని ఇష్టపడుతుంది. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు. వివాహం చేసుకోవాలని కలలు కంటారు. అయితే విధి వారి ప్లాన్‌ను తలకిందులు చేస్తుంది. ఊహించని సంఘటనలతో దర్శి మరొక అమ్మాయి లక్ష్మి (అనన్య నాగళ్ల)ని వివాహం చేసువాల్సి వస్తుంది.

Read Also : ఆ పాడు వీడియోలకు అడిక్ట్… పక్కింటోళ్ల ప్రైవేట్ వీడియోలు చూసి… స్ట్రిక్ట్లీ సింగిల్స్‌కు మాత్రమే

ఆతరువాత అతను ఒక దారుణమైన సంఘటన కారణంగా జైలుకు వెళ్తాడు. దర్శి జీవితంలో ఈ ఊహించని మలుపు, అతని ప్రేమ కథను, పుష్ప జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇదే సమయంలో పుష్ప తనపై జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ముఖ్యంగా శివయ్యపై ఆమె ప్రతీకారంతో రగిలిపోతుంటుంది. మరోవైపు దర్శి భార్య లక్ష్మి ఒక రహస్యాన్ని కనుగొంటుంది. ఇది ఆమె జీవితాన్ని కూడా అనూహ్య మార్గంలోకి నడిపిస్తుంది. ఇక ఈ సిరీస్ క్లైమాక్స్‌లో, పుష్ప ప్రతీకార యాత్రతో ఒక ఉత్కంఠభరిత ముగింపు వస్తుంది. పుష్ప శివయ్య పై ప్రతీకారం తీర్చుకుంటుందా ? దర్శి జైలుకు ఎందుకు వెళ్తాడు ? అసలు పుష్ప వేశ్యగా ఎందుకు మారింది ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : చిన్న పిల్లలపై చెయ్యేస్తే ఈ సైకో చేతిలో మూడినట్టే… ఇలాంటి సైకోలు కూడా ఉంటారా భయ్యా

OTT Movie : అక్కా చెల్లెల్లు ఇద్దరూ ఒక్కడితోనే… లాస్ట్ కి కేక పెట్టించే కిర్రాక్ ట్విస్ట్

OTT Movie : ఊర్లో ఒక్కరిని కూడా వదలని దొర… పెళ్లి కాకుండానే అలాంటి పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : భార్య బట్టలు మార్చుకుంటుండగా పాడు పని… అనుమానపు భర్త అరాచకం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : తెగిపడే ఆడవాళ్ళ తలలు… క్వశ్చన్ మార్క్ కిల్లర్ బ్రూటల్ హత్యలు… ట్విస్టులతో మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

OTT Movie : మనిషి మాంసం, రక్తం కోసం తహతహలాడే రాక్షస జీవులు… బ్లడీ బ్లడ్ బాత్… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్

OTT Movie : మరో అమ్మాయితో భర్త ప్రైవేట్ వీడియో లీక్… డర్టీ పొలిటికల్ గేమ్ లో ఫ్యామిలీ బలి… ఇంటెన్స్ కోర్టు రూమ్ డ్రామా

OTT Movie : పిల్లల్ని చంపి అమరుడయ్యే విలన్… పాప ఎంట్రీతో ఒక్కొక్కడికీ దబిడి దిబిడే… ఈ సైకలాజికల్ హారర్ మూవీ అదుర్స్

Big Stories

×