OTT Movie : మర్డర్ మిస్టరీలు సీను సీనుకో ట్విస్ట్ తో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే థ్రిల్లర్, ముఖ్యంగా కిల్లర్ సినిమాల కోసమే ప్రత్యేకంగా ఓటీటీలో వెతికేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? కథేంటి? అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
ఆహాలో స్ట్రీమింగ్
ఈ తమిళ థ్రిల్లర్ పేరు ‘పరమశివన్ ఫాతిమా’ (Paramasivan Fathima). ఎసక్కి కర్వన్నన్ రచన, దర్శకత్వం, నిర్మాణంలో తీసిన తమిళ హారర్-థ్రిల్లర్ చిత్రం. ఇందులో విమల్, చాయాదేవి, ఎం.ఎస్. భాస్కర్, కూల్ సురేష్, శ్రీరంజని, అరుల్‌దాస్, ఆథిరా ప్రధాన పాత్రలు పోషించారు. 143 నిమిషాల రన్‌టైమ్‌తో, A రేటింగ్‌తో (పెద్దలకు మాత్రమే) ఈ మూవీ 2025 జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏ రేటింగ్ కాబట్టి చిన్న పిల్లలతో కలిసి ఈ మూవీని చూడకపోవడమే బెటర్.
కథలోకి వెళ్తే…
ఈ మూవీ స్టోరీ తమిళనాడులోని రెండు పక్కనే ఉన్న గ్రామాలైన సుబ్రమణ్యపురం (హిందూ), యోకోపురం (క్రిస్టియన్) మధ్య మతపరమైన ఘర్షణల నేపథ్యంలో జరుగుతుంది. ఈ గ్రామాల్లో విచిత్రమైన రీతిలో, అత్యంత కిరాతకంగా వరుస హత్యలు జరుగుతాయి. దీంతో మా ఊరి వాళ్ళను మీరే చంపారని సుబ్రమణ్యపురం గ్రామస్థులు అంటే, మీరే మా ఊరి వాళ్ళను చంపారంటూ యోకోపురం వాళ్ళు గొడవకు దిగుతారు.
పోలీసు అధికారి (ఎసక్కి కర్వన్నన్) ఈ హత్యలను దర్యాప్తు చేస్తూ, హంతకుడు మానవుడు కాదని, గ్రామంలో దాగివున్న ఒక పురాతన రహస్యంతో ఈ హత్యలకు సంబంధం ఉందని కనిపెడతాడు. నెక్స్ట్ కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. అక్కడ బాల్య స్నేహితులు పరమశివన్ (విమల్), ఫాతిమా/తమిళ్‌సెల్వి (చాయాదేవి) మధ్య ప్రేమ కథ నడుస్తుంది. ఈ ఇద్దరూ వేర్వేరు మతాల నుంచి వచ్చిన వారు కావడంతో, వారి ప్రేమకు గ్రామాల్లోని సంప్రదాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.
ఫాతిమా తండ్రి మరణం, అతని హిందూ సమాధి కోసం చేసిన చివరి కోరిక, మతమార్పిడి వివాదాలు రెండు గ్రామాల మధ్య శ్మశాన భూమి వివాదానికి దారితీస్తాయి. ఆ తరువాత స్టోరీ ఎలాంటి టర్న్ తీసుకుంది? హీరోయిన్ ఎలా చనిపోయింది? ఇప్పుడు ఎందుకు రెండు ఊర్లపై ఇలా ప్రతీకారం తీర్చుకుంటోంది? అసలు పెళ్లి కొడుకులనే ఎందుకు టార్గెట్ చేస్తుంది ? క్లైమాక్స్ లో ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమాను ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిందే . చిన్న పిల్లల ముందు ఈ మూవీని చూడకూడదు అని మాత్రం మర్చిపోవద్దు. సైకో థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ లవర్స్ కు వర్త్ వాచింగ్ మూవీ ఇది.
Read Also : అమ్మాయిలను టచ్ చేయకుండానే అత్యంత కిరాతకంగా చంపే సైకో… ట్విస్టులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్