BigTV English

OTT Movie : స్కూల్ పిల్లలతో దెయ్యాల దోబూచులాట … గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్

OTT Movie : స్కూల్ పిల్లలతో దెయ్యాల దోబూచులాట … గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్

OTT Movie : తైవాన్‌లో ఒక భయాంకరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ దారుణమైన సైనిక చట్టం అమలు చేస్తారు. స్వేచ్ఛాగా తిరగలేక పోతారు. రాజకీయ ఖైదీలు హింసించబడతారు. ఆ సమయంలో ఒక సెకండరీ స్కూల్‌లో, వీ (త్సెంగ్ చింగ్-హువా) ఫాంగ్ (గింగిల్ వాంగ్) అనే విద్యార్థులు చిక్కుకుంటారు. అది ఇప్పుడు ఒక భయంకరమైన ప్రాంతంగా మారిపోయింది. ఖాళీ కారిడార్‌లు, రక్తం తడిసిన గోడలు, దెయ్యాల లాంతర్లు వారిని వెంటాడతాయి. వీళ్ళ గురువు మిస్టర్ చాంగ్ కూడా కనిపించకుండా పోతాడు. వీళ్ళు అతన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, స్కూల్‌లో ఒక చీకటి చరిత్ర బయటపడుతుంది. అక్కడ వీళ్ళకు కనిపిస్తున్న దెయ్యాలు నిజమైనవా, లేక పీడకలలో భాగంగా వస్తున్నాయా ? ఈ భయంకరమైన స్కూల్ నుండి వీళ్ళు తప్పించుకోగలరా ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివారాలు తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

1962లో తైవాన్‌లోని వైట్ టెర్రర్ కాలంలో ఈ స్టోరీ జరుగుతుంది. ప్రభుత్వం రాజకీయ విభేదాలను దారుణంగా అణచివేస్తుంది. ఈ కాలంలో స్వేచ్ఛా , పుస్తకాలు, వామపక్ష సిద్ధాంతాలు నిషేధించబడ్డాయి. వీటిని అనుసరించిన వాళ్ళకు కఠినమైన శిక్షలు విధిస్తుంటారు. ఇప్పుడు ఈ కథ త్సుయ్‌హువా సెకండరీ స్కూల్‌లో జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు వీ చుంగ్-టింగ్ (త్సెంగ్ చింగ్-హువా), ఫాంగ్ రే-షిన్ (గింగిల్ వాంగ్) ఒక రాత్రి స్కూల్‌లో చిక్కుకుంటారు. ఈ స్కూల్ ఇప్పుడు ఒక పీడకలలాంటి, సూరియల్ ప్రపంచంగా మారిపోయింది. ఇక్కడ దెయ్యాల లాంతర్లు, రక్తం తడిసిన గోడలు, భయంకరమైన జీవులు వారిని వెంటాడతాయి.


వీ, ఫాంగ్ తమ గురువు మిస్టర్ చాంగ్ (ఫు మెంగ్-పో) మిస్ యిన్ (సెసిలియా చోయ్) నేతృత్వంలోని ఒక రహస్య బుక్ క్లబ్‌లో సభ్యులు. ఈ క్లబ్ నిషేధిత పుస్తకాలను చదవమని ప్రోత్సాహిస్తుంది. స్వేచ్ఛ గురించి కూడా చర్చిస్తుంది. అయితే ఈ చర్యలు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం. దీని వల్ల వీళ్ళంతా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఈ బుక్ క్లబ్ కార్యకలాపాలు బయటపడతాయి. అందులోని సభ్యులు ఒక్కొక్కరూ ఖైదు చేయబడతారు. స్కూల్‌లో చిక్కుకున్న వీ, ఫాంగ్, బయటకు వెళ్లే బ్రిడ్జ్ నాశనం కావడంతో అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక వీళ్ళిద్దరూ తమ గతాన్ని తలచుకుని బాధపడతారు. ఫాంగ్ తన ఇంట్లో హింసను ఎక్కువగా ఎదుర్కుంటుంది. ఆమె తల్లి ఒక దుర్మార్గమైన పాత్రగా ఇందులో కనిపిస్తుంది. ఇక ఒక క్రూరమైన సైనిక అధికారి కుట్ర కారణంగా, ఈ క్లబ్ సభ్యులు దొరికిపోతారు. అయితే స్కూల్‌లో భయంకరమైన జీవులు, లాంతర్లు, షాడో ఫిగర్స్ ఆ ప్రాంతాన్ని మరింత భయంకరంగా మారుస్తాయి. చివరికి వీ, ఫాంగ్ ఈ కుట్రలో చిక్కుకుంటారా ? స్కూల్ లో కనిపిస్తున్న నీడలు ఎవరివి ? లాంతర్లు ఎవరు వెలిగిస్తున్నారు ? ఆక్కడ సైనిక పాలన అంతం అవుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ తైవాన్‌ మూవీ పేరు ‘డిటెన్షన్’ (Detention). దీనికి జాన్ హ్సు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు IMDbలో 6.6/10 రేటింగ్ ఉంది. ఇందులో గింగిల్ వాంగ్ (ఫాంగ్ రే-షిన్), త్సెంగ్ చింగ్-హువా (వీ చుంగ్-టింగ్), ఫు మెంగ్-పో (మిస్టర్ చాంగ్), సెసిలియా చోయ్ (మిస్ యిన్), లీ లింగ్-వెయ్ (ఫాంగ్ తల్లి) వంటి నటులు నటించారు. ఓటీటీ ప్లాట్‌ఫాం: నెట్‌ఫ్లిక్స్ (Netflix). అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్ … పల్లెటూరి ప్రేమలు … ట్విస్టులతో సాగిపోయే లవ్ స్టోరీ

OTT Movie : నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులు

OTT Movie : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

Big Stories

×