E-Paper
Advertisement

OTT Movie : శోభనం రాత్రి భార్యతో కలిసి ఇంకొకడి కోసం ఆరాటం… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : శోభనం రాత్రి భార్యతో కలిసి ఇంకొకడి కోసం ఆరాటం… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : కామెడీ జానర్ లో వచ్చిన ఒక మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుంది. రిలీఫ్ కావాలనుకునే వాళ్ళకి, ఈ సినిమా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా స్టోరీ కూడా ఒక రాత్రి సమయంలోనే జరుగుతుంది. ఇందులో యమి గౌతమ్ నటన సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ యాక్షన్ కామెడీ మూవీ పేరు ‘ధూమ్ ధామ్’ (Dhoom Dham). 2025లో విడుదలైన ఈ సినిమాకి రిషబ్ సేథ్ దర్శకత్వం వహించారు. ఇందులో యమి గౌతమ్ ధర్, ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్‌ల కింద జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించారు. ఇది 2025 ఫిబ్రవరి 14న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో విడుదలైంది. ఈ సినిమాకి IMDB లో 6.4/10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఒక రాత్రి సమయంలో జరిగే యాక్షన్ కామెడీగా మొదలవుతుంది. ఇక్కడ ఒక బ్యాగ్‌లో కోట్ల రూపాయలను, తీసుకెళ్తున్న ఒక కారును కొందరు ముసుగు వేసుకున్న దొంగలు దోచుకుంటారు. మరో వైపు వీర్ అనే ఫోబియాస్‌తో నిండిన ఒక గుజరాతీ వెటరనరీ డాక్టర్ కు, కోయల్ అనే ఒక ధైర్యవంతమైన పంజాబీ అమ్మాయితో అరేంజ్డ్ మ్యారేజ్‌ జరుగుతుంది. వీళ్లిద్దరూ మొదటి రాత్రి ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా, ఇద్దరు ఆయుధాలు ధరించిన గూండాలు వారి గదిలోకి చొరబడతారు. చార్లీ ఎక్కడ అని డిమాండ్ చేసి అడుగుతారు. వీళ్ళిద్దరూ చార్లీ ఎవరో మాకు తెలియదని, ఆ గూండాల నుంచి తప్పించుకుని, ముంబై వీధుల్లో పరుగులు తీస్తారు. కోయల్ ధైర్యం తెచ్చుకుని, ఒక పిస్టల్ తీసుకుని గూండాలను ఎదుర్కొంటుంది. అయితే వీర్ తన భయాలతో పోరాడుతూ ఆమెకు సాయం చేస్తాడు.

వీర్, కోయల్ ఈ  “చార్లీ” ఎవరు, ఏమిటో కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వీర్, కోయల్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. కోయల్ తిరుగుబాటు స్వభావం, వీర్ జాగ్రత్త స్వభావం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక మిస్టరీ అంతా ఒక పెన్ డ్రైవ్‌తో సంబంధం కలిగి ఉంటుంది. చార్లీ అంటే ఒక విలువైన పెన్ డ్రైవ్‌ గా చూపించడం జరుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ ఒక హై-స్టేక్స్ ఛేజ్‌తో ముగుస్తుంది. చివరికి ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది ? గ్యాంగ్ స్టర్లు వీర్, కోయల్ ను ఎందుకు వెంబడిస్తున్నారు ? కారు దోపిడికి, పెన్ డ్రైవ్ కి సంబంధం ఉందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ యాక్షన్ కామెడీ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేని పోలీస్… ఒక్కో కేసులో ఊహించని ట్విస్టులు… అదిరిపోయే సర్ప్రైజులు

Tags

Related News

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×