Romantic Movie OTT : డిప్రెషన్ మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ దాని నుంచి బయట పడడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… ఈరోజు మన మూవీ సజెషన్ ఇలాంటి టాపిక్ తో తెరకెక్కిందే. డిప్రెషన్ లో సర్జన్ ఏం చేశాడు ? అన్నది మూవీలో చూడాల్సిందే. మరి ఆ మూవీ పేరేంటి ? దాని కథ ఏంటో? తెలుసుకుందాం పదండి.
ఈ సినిమా పేరు ‘Dogs Don’t Wear Pants’ (2019). టైటిల్ ఎంత విచిత్రంగా ఉందో మూవీ కూడా అంతే వెరైటీగా ఉంటుంది. ఈ ఫిన్నిష్ డార్క్ కామెడీ-డ్రామాలో మనిషి తనలోని బాధను మర్చిపోవడానికి ఎంతటి వింత మార్గాలను వెతుక్కుంటాడో రా అండ్ రస్టిక్ గా చూపించారు. ఈ సినిమాకి జె-పి వల్కెపా దర్శకత్వం వహించగా, ఆయన సినిమాను చాలా రియలిస్టిక్‌గా తీశారు. ఇది ప్రస్తుతం ఇండియాలో డైరెక్ట్ ఓటీటీల్లో అందుబాటులో లేదు. కానీ MUBIలో చూడొచ్చు. అలాగే Amazon Prime లో విదేశాల్లో రెంట్ కి అందుబాటులో ఉంది. ఈ సినిమాకి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాలో వచ్చే కొన్ని సీన్లు… పళ్లు పీకడం, ఉరి వేసుకోవడం వంటివి చూడ్డానికి భయంకరంగా ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లలతో ఈ సినిమాను చూడకుండా ఉంటేనే మంచిది. ఇలాంటి సైకలాజికల్ సినిమాలు ఇష్టపడేవారు, అందులోనూ ధైర్యం ఉంటేనే చుడండి.
జుహా అనే సర్జన్ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. తన భార్య నీళ్లలో మునిగి చనిపోవడాన్ని ఆయన స్వయంగా కళ్లారా చూస్తాడు. అప్పటి నుండి అతను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. అంత డిప్రెషన్ లోనూ అతను తన కూతురిని బాగా చూసుకుంటాడు. కూతురు తప్ప జీవితం మీద అతనికి ఎలాంటి ఆశ ఉండదు. ఒకరోజు అనుకోకుండా ‘మోనా’ అనే మహిళను కలుస్తాడు. అక్కడ ఆమె జుహా గొంతు నులుముతుంది. అలా ఆ ఊపిరి ఆడని స్థితిలో అతనికి చనిపోయిన తన భార్య కనిపిస్తుంది. ఆ ఒక్క క్షణం భార్యను చూడటం కోసం జుహాకి ఈ ‘నొప్పి’ రోజూ కావాలి అన్నంత పిచ్చి మొదలవుతుంది.
Also Read : ఢాకా వీధుల్లో మార్వెల్ హీరో… యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తున్న సినిమా
ఆ బాధలోనే తనకు శాంతి, విముక్తి లభిస్తుందని అతను గట్టిగా నమ్ముతాడు. ఆ తర్వాత నుంచి జుహా పదే పదే మోనా దగ్గరికి వెళ్లి, తనను హింసించమని కోరుతాడు. బయట ప్రపంచానికి ఒక గౌరవప్రదమైన డాక్టరుగా కనిపిస్తూనే, లోపల మాత్రం ఆ వింతైన పెయిన్ కు బానిస అవుతాడు. ఈ క్రమంలో ఆయన వర్క్ లైఫ్ దెబ్బతింటుంది, కూతురితో గొడవలు స్టార్ట్ అవుతాయి. చివరికి అతని పిచ్చి ముదిరి, అది ఏ స్థాయికి వెళ్తుందంటే… తన పంటిని తానే పీకించుకునేంత నొప్పికి అలవాటు పడిపోతాడు. మోనా కూడా మొదట్లో కేవలం డబ్బు కోసం ఇలాంటి పని చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ నెమ్మదిగా అతనిలోని బాధను చూసి అతనికి దగ్గరవుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఉండే బంధం మామూలు ప్రేమ కథలా కన్పించదు. అంతా రక్తం, నొప్పి, ఊపిరి ఆడని క్షణాల చుట్టూ తిరుగుతుంది. మరి ఆ డాక్టర్ కు చివరకు విముక్తి ఎలా దక్కింది ? క్లైమాక్స్ ఏంటి అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.