Horror Movie OTT : బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ వీకెండ్ ఎంచక్కా ఇంట్లోనే ఓ మంచి హారర్ మూవీని చూస్తూ చిల్ అవ్వాలి అనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ తల్లీబిడ్డల కథను రాత్రిపూట ఒంటరిగా చూస్తే భయంతో చెమటలు పట్టడం ఖాయం. హర్రర్ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఈ మూవీ ఇండియాలో ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఈ హర్రర్ థ్రిల్లర్ పేరు ‘Bed Rest’ (2022). ఈ సినిమా కథ గర్భవతిగా ఉన్న ఒక స్త్రీ తన ఇంట్లో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Video ఓటీటీలో చూడటానికి అందుబాటులో ఉంది. ఇదొక స్లో-బర్న్ హారర్ మూవీ, అంటే సినిమా నెమ్మదిగా మొదలై చివర్లో భయంకరంగా మారుతుందన్న మాట. హర్రర్ మూవీ లవర్స్ ను సినిమాలో నిమగ్నం అయ్యేలా చేసి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన థ్రిల్ ను చివర్లో ఇస్తుందన్న మాట. ముఖ్యంగా తల్లుల సెంటిమెంట్, గర్భం దాల్చినప్పుడు ఉండే భయాలను కనెక్ట్ అయ్యేలా చూపించారు. ‘The Conjuring’ లాంటి ఇంటి నేపథ్యంలో సాగే దయ్యాల సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి డోంట్ మిస్.
జూలీ (మెలిస్సా బారెరా), ఆమె భర్త డేనియల్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్. ఈ దంపతులు ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. గతంలోనే జూలీ ఒక బిడ్డను కోల్పోతుంది. ఇప్పుడు మరోసారి గర్భవతి కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే డాక్టర్లు ఆమెకు బెడ్ రెస్ట్ సూచిస్తారు. అలా గదిలో ఒంటరిగా పడుకుంటున్న జూలీకి వింత వింత శబ్దాలు విన్పించడంతో కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
Also Read : భర్తను కాదని ప్రియురాలితో… మతి పోగొడుతున్న ఇద్దరమ్మాయిల రచ్చ
అంతేకాదు ఎవరో తిరుగుతున్నట్టు, ఒక చిన్న పిల్లోడు కనిపిస్తున్నట్టు ఆమె భ్రమపడుతుంది. అయితే అవి కేవలం భ్రమలా లేక ఆ ఇంట్లో ఉన్న దయ్యాలా ? అనేది అర్థం కాక ఆమె పిచ్చిదైపోతుంది. జూలీ ఈ విషయం గురించి ఎంత చెప్పినా ఆమె భర్త నమ్మడు. పైగా ఆమెకు పిచ్చి పట్టిందని భావిస్తాడు. కానీ ఆ ఇంట్లో ఏదో ఒక అదృశ్య శక్తి ఉందని జూలీకి అర్థమవుతుంది. మరి ఆమె అనుకున్నదే నిజమా ? గతంలో ఆ ఇంట్లో ఉన్న ఒక తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి ఏం చేసింది ? ఇప్పుడు ఆ ఆత్మలు జూలీ కడుపులో ఉన్న బిడ్డను ఏం చేయాలి అనుకుంటున్నాయి ? అనే అంశాలు సినిమాను ఉత్కంఠభరితంగా మారుస్తుంది. మంచం మీద నుండి దిగలేని పరిస్థితిలో, తనను – తనకు పుట్టబోయే బిడ్డను ఆ శక్తుల నుండి జూలీ ఎలా కాపాడుకుంది ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.