OTT Movie : ఇండోనేషియన్ హారర్ సినిమాలను చూడాలంటే , గుండె ధైర్యం ఎక్కువే ఉండాలి. ఈ సినిమాలలో హారర్ సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. ఈ జానర్ లోనే అక్కడినుంచి ఎక్కువగా సినిమాలు వస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక అపార్ట్మెంట్ లో ఆరవ ఫ్లోర్ లో ఉండే దెయ్యాలను చూస్తే నాలుగు రోజుల్లో చనిపోతారు. కొత్తగా వచ్చిన అక్కా చెల్లెళ్ళు, పొరపాటున ఈ దెయ్యాలను చూస్తారు. ఆ తరువాత స్టోరీ బీభత్సంగా మారుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు’ది హాంటెడ్ అపార్ట్‌మెంట్’: మిస్ కె’ (The Haunted Apartment Miss K). 2024 లో వచ్చిన ఈ సినిమాకి గుంటూర్ సోహర్జోంటో దర్శకత్వం వహించారు. 2023లో విడుదలైన ‘పంగోనన్ వింగిట్’ అనే సినిమాకి ఇది సీక్వెల్‌గా రూపొందింది. ఈ స్టోరీ ఒక పురాణ కథ ఆధారంగా, హాంటెడ్ అపార్ట్‌మెంట్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో సింటా లారా కీహ్ల్ (ఆల్మా), అరిఫిన్ పుత్ర (రయ్యాన్), కాలిస్తా అరుమ్ (మియా), ఇండ్రా బ్రాస్కో (ఐమన్), ఇంటాన్ ఆర్.జె. (వులన్)ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2024 జూలై 26న థియేటర్లలో విడుదలై, 2025 మే 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 1 గంట 43 నిమిషాల రన్ టైమ్‌తో,IMDbలో 5.6/10 రేటింగ్ ను కలిగిఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా ఆల్మా, ఆమె సోదరి మియా చుట్టూ తిరుగుతుంది. ఆల్మా మొదలు పెట్టిన కేఫ్ వ్యాపారం నష్టాలతో ముగుస్తుంది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో, జకార్తా నుండి సురబాయాకు మారుతుంది. ఆమె పోలీస్ డిటెక్టివ్ అయిన తన ప్రియుడు రయ్యాన్ సలహాతో సస్మయ అపార్ట్‌మెంట్‌లో రిసెప్షన్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరుతుంది. ఆల్మా, మియా అందులోనే మూడవ అంతస్తులో నివసిస్తారు. కానీ అపార్ట్‌మెంట్‌లోని ఆరవ అంతస్తు, ముఖ్యంగా నెంబర్ 610 లో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంటుంది. దానిలోకి ప్రవేశించిన ఎవరైనా నాలుగు రోజులలో చనిపోతారు. ఒక రోజు ఆల్మాకు సీలింగ్ నుండి నీరు కారుతుందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తాడు. ఆల్మా నెంబర్ 610ని తనిఖీ చేయడానికి ఆరవ అంతస్తుకు వెళ్తుంది. అక్కడ ఆమె మిస్ కె, ఆమె కుమార్తె కిరణి అనే దెయ్యాలను చూస్తుంది. వెంటనే ఆల్మా, మియాపై ఈ దెయ్యాల శాపం మొదలవుతుంది.
ఈ శాపం కారణంగా, ఆల్మా, మియా బ్రతకడానికి, ఇక నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న రయ్యాన్, ఒక డిటెక్టివ్‌గా, నెంబర్ 610లో జరిగిన గత హత్యలను దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఆల్మా, రయ్యాన్ ఒక సుక్మో అనే సైకిక్ సహాయం తీసుకుంటారు. అతను ఆ దెయ్యాలు ఒక తల్లీ, కూతుర్లవని తెలియజేస్తాడు. ఈ హత్యలను ఆ అపార్ట్‌మెంట్ యజమానులులే చేశారని చెప్తాడు. అవి ప్రతీకారం కోసం ఆ గదిలో ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి. చివరికి నాలుగు రోజుల తరువాత ఆల్మా,మియా చనిపోతారా ? దెయ్యాలుగా మారిన తల్లీకూతుర్లు రెవేంజ్ ఎలా తీర్చుకుంటారు ? డిటెక్టివ్ తో కలసి వీళ్ళు దెయ్యాలను ఎలా ఎదుర్కుంటారు ?అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒకే ఇంట్లో 13 సార్లు చావు… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్… ఈ హర్రర్ మూవీలో సీన్ సీనుకూ గుండె జారిపోవాల్సిందే